ప్రో కబడ్డీ లీగ్ ఈ సారి దుమ్ము రేపనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించి సొంతం చేసుకున్నారు. కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు రీటెయిన్ చేసుకోగా మరికొంత మంది ఆటగాళ్లు కొత్తగా జట్లులో వచ్చి చేరారు. మొత్తంగా 12 జట్లు ప్రోకబడ్డి లీగ్ టైటిల్ కోసం బరిలో నిలవనున్నాయి.అయితే ఈ సారి వేలంపాటలో రాజస్థాన్‌కు చెందిన రైడర్ సచిన్ తన్వార్ పంట పండింది. రాజస్థాన్ జట్టు తన్వార్‌ను రిలీజ్ చేయడంతో ఆ ఆటగాడిని తమిళ్ తలైవాస్ జట్టు రూ.2.15 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావ్‌ను తెలుగు టైటాన్స్ జట్టు యాజమాన్యంఫైనల్ బిడ్ మ్యాచ్ కార్డు వినియోగించి రూ..1.725 కోట్లకు కొనుగోలు చేసింది. ముందుగా యుముంబా మరియు బెంగళూరు బుల్స్ పవన్ కోసం పోటీ పడ్డాయి. ఒకానొక సమయంలో బెంగళూరు బుల్స్ పవన్ కోసం రూ.కోటి వెచ్చించేందుకు తయారైంది.ఇక ఒకానొక సమయంలో రూ.1.45 కోట్లకు బిడ్డింగ్ చేరుకోగానే ఇక ముందుకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. దీంతో తెలుగు టైటాన్స్ జట్టు తిరిగి పవన్ సెహ్రావత్‌ను దక్కించుకుంది. గత సీజన్‌లో పవన్ సెహ్రావత్ రికార్డు ధరకు అంటే రూ.2.605 కోట్లకు తెలుగు టైటాన్స్ దక్కించుకుంది. కానీ తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది.

ప్రోకబడ్డీ లీగ్ 2024 సీజన్ ఈ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. కూత కూసి వేటు వేసేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆటగాళ్ల కొనుగోలు పూర్తి కావడంతో ఇక బరిలో దిగి కూత పెట్టేందుకు రెడీ అయ్యారు. 12 జట్లకు సంబంధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగాల్ వారియర్స్ పూర్తి జట్టు
రైడర్స్:విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్, మహారుద్ర గార్జే, సుశీల్ కాంబ్రేకర్, మణిందర్ సింగ్, చై-మింగ్ చాంగ్, ఆకాష్ బి చవాన్, అర్జున్ రాఠీ, ప్రణయ్ వినయ్ రాణే
డిఫెండర్లు:శ్రేయాస్ ఉంబార్దండ్, ఆదిత్య ఎస్. షిండే, మంజీత్, దీప్ కుమార్, దీపక్ అర్జున్ షిండే, యష్ మాలిక్, ఫజెల్ అత్రాచలి, నితేష్ కుమార్, మయూర్ జగన్నాథ్ కదమ్, ప్రవీణ్ ఠాకూర్, హేమ్ రాజ్, శంభాజీ వాబలే, వైభవ్ భౌసాహెబ్ గర్జే
ఆల్ రౌండర్ :సాగర్ కుమార్
తెలుగు టైటాన్స్ పూర్తి స్క్వాడ్
రైడర్స్ : చేతన్ సాహు, రోహిత్, ప్రఫుల్ జవారే, ఓంకార్ పాటల్,నితిన్, మంజీత్, ఆశిష్ నర్వాల్
డిఫెండర్స్:అంకిత్, అజిత్ పవార్, సాగర్, కృష్ణ ధుల్, మిలాద్ జబ్బారీ,మొహ్మద్ మాలక్, సుందర్
ఆల్‌రౌండర్లు: సంజీవి, శంకర్ గదాయ్, పవన్ సెహ్రావత్,విజయ్ మాలిక్, అమిత్ కుమార్.
దబాంగ్ ఢిల్లీ పూర్తి జట్టు
రైడర్స్:నవీన్ కుమార్, అషు మాలిక్, మను, మోహిత్, సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్, మహ్మద్ మిజనూర్ రెహమాన్, హిమాన్షు, పర్వీన్, రాహుల్, వినయ్
డిఫెండర్లు: హిమ్మత్ అంటిల్, ఆశిష్, యోగేష్, విక్రాంత్, సందీప్, మహమ్మద్ బాబా అలీ, గౌరవ్ చిల్లర్, రాహుల్, రింకు నర్వాల్
ఆల్‌రౌండర్లు:ఆశిష్ , నితిన్ పన్వార్, బ్రిజేంద్ర సింగ్ చౌదరి
గుజరాత్ జెయింట్స్ పూర్తి జట్టు:
రైడర్స్:రాకేష్, పార్తీక్ దహియా, నితిన్, గుమాన్ సింగ్, మోను, హిమాన్షు, హిమాన్షు సింగ్, ఆదేశ్ సివాచ్
డిఫెండర్లు:సోంబిర్, వహిద్ రెజాఇమెహర్, నీరజ్ కుమార్, హర్ష్ మహేష్ లాడ్, మోహిత్, మనుజ్, నితేష్
ఆల్‌రౌండర్లు: జితేందర్ యాదవ్, బాలాజీ డి, మహ్మద్ ఎస్మాయిల్ నబీభక్ష్, రాజ్ డి. సలుంఖే, రోహన్ సింగ్
హర్యానా స్టీలర్స్ పూర్తి జట్టు:
రైడర్స్: వినయ్, శివం పటారే, విశాల్ తాటే, జయసూర్య న్స్, ఘనశ్యామ్ మగర్, జ్ఞాన అభిషేక్ ఎస్, వికాస్ జాదవ్
డిఫెండర్లు: మణికందన్ ఎన్, హర్దీప్, జైదీప్ దహియా, రాహుల్ సేత్పాల్, మోహిత్ నందల్, సంజయ్, ఆశిష్ గిల్, మణికందన్ ఎస్.
ఆల్‌రౌండర్లు: సాహిల్, మొహమ్మద్రెజా షాద్లౌయ్ చియానెహ్, నవీన్, సంస్కర్ మిశ్రా
జైపూర్ పింక్ పాంథర్స్ పూర్తి జట్టు
రైడర్స్:అర్జున్ దేశ్వాల్, రితిక్ శర్మ, అభిజీత్ మాలిక్, సోంబీర్, శ్రీకాంత్ జాదవ్, వికాష్ ఖండోలా, నీరజ్ నర్వాల్, కె. ధరణీధరన్, నవనీత్
డిఫెండర్లు: అంకుష్, అభిషేక్ క్స్, రెజా మిర్బాగేరి, నితిన్ కుమార్, రోనక్ సింగ్, సుర్జీత్ సింగ్, అర్పిత్ సరోహా, మయాంక్ మాలిక్, రవి కుమార్, లక్కీ శర్మ
ఆల్‌రౌండర్లు: అమీర్ హోస్సేన్ మొహమ్మద్మలేకిజ్, అమీర్ వానీ
పాట్నా పైరేట్స్ పూర్తి జట్టు:
రైడర్స్: కునాల్ మెహతా, సుధాకర్ ఎం, సందీప్ కుమార్, సాహిల్ పాటిల్, దీపక్, అయాన్, జంగ్-కున్ లీ, మీటూ, ప్రవీందర్, దేవాంక్
డిఫెండర్లు: మనీష్, అబినంద్ సుభాష్, నవదీప్, శుభమ్ షిండే, హమీద్ నాదర్, త్యాగరాజన్ యువరాజ్, దీపక్ రాజేంద్ర సింగ్, ప్రశాంత్ కుమార్ రాఠి, సాగర్, అమన్, బాబు మురుగసన్
ఆల్‌రౌండర్లు:అంకిత్, గురుదీప్
పుణెరి పల్టన్ పూర్తి జట్టు:
రైడర్స్:పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, నితిన్ ఆర్, ఆకాష్ షిండే, ఆదిత్య షిండే, ఆర్యవర్ధన్ నావలే, అజిత్ వి కుమార్
డిఫెండర్లు: సంకేత్ సావంత్, అభినేష్ నడరాజన్, గౌరవ్ ఖత్రి, వైభవ్ కాంబ్లే, దాదాసో పూజారి, తుషార్ దత్తరాయ్ అధవాడే, మోహిత్, అలీ హదీ, అమన్, మొహమ్మద్. అమన్, విశాల్, సౌరవ్
ఆల్‌రౌండర్లు:అస్లాం ముస్తఫా ఇనామ్దార్, అమీర్ హసన్ నోరూజీ
తమిళ్ తలైవాస్ పూర్తి జట్టు:
రైడర్స్:విశాల్ చాహల్, రామ్‌కుమార్ మాయాండి, నితిన్ సింగ్, నరేందర్, ధీరజ్ బైల్‌మరే, సచిన్, సౌరభ్ ఫగారే
డిఫెండర్లు:M. అభిషేక్, హిమాన్షు, సాగర్, ఆశిష్, మోహిత్, సాహిల్ గులియా, అనుజ్ గవాడే, రోనక్, నితేష్ కుమార్, అమీర్హోస్సేన్ బస్తామి
ఆల్‌రౌండర్లు:మోయిన్ సఫాగి
U ముంబా పూర్తి జట్టు:
రైడర్స్:శివమ్, అజిత్ చౌహాన్, మంజీత్, M. ధనశేఖర్, స్టువర్ట్ సింగ్, విశాల్ చౌదరి, సతీష్ కన్నన్
డిఫెండర్లు:గోకులకన్నన్ ఎం, రింకు, లోకేష్ ఘోస్లియా, బిట్టు, సోంబీర్, ముకిలన్ షణ్ముగం, సన్నీ, దీపక్ కుందు, సునీల్ కుమార్, అమీన్ ఘోరబానీ, పర్వేష్ భైన్‌వాల్, ఆశిష్ కుమార్
ఆల్‌రౌండర్లు: అమీర్ మహ్మద్ జఫర్దానేష్, శుభం కుమార్
UP యోధాస్ పూర్తి జట్టు
రైడర్స్: సురేందర్ గిల్, గగన గౌడ, శివమ్ చౌదరి, కేశవ్ కుమార్, హెదరాలీ ఎక్రమి, భవాని రాజ్‌పుత్, అక్షయ్ ఆర్. సూర్యవంశీ
డిఫెండర్లు: సుమిత్, అషు సింగ్, గంగారామ్, జయేష్ మహాజన్, హితేష్, సచిన్, సాహుల్ కుమార్, మహమ్మద్రెజా కబౌద్రహంగీ, మహేందర్ సింగ్
ఆల్‌రౌండర్లు:భరత్, వివేక్
ఏయే జట్ల వద్ద ఇంకా ఎంత డబ్బులు మిగిలి ఉంది
బెంగాల్ వారియర్స్: రూ.10.035 లక్షలు
బెంగళూరు బుల్స్: రూ.5.962 లక్షలు
దబాంగ్ ఢిల్లీ : రూ.87.245 లక్షలు
గుజరాత్ జైంట్స్ : రూ6.444 లక్షలు
హర్యానా స్టీలర్స్ : రూ.0.391 లక్షలు
జైపూర్ పింక్ పాంథర్స్ : రూ.13.07 లక్షలు
పాట్నా పైరేట్స్ : రూ.35.874 లక్షలు
పునేరీ పల్టాన్ : రూ.32.064 లక్షలు
తమిళ్ తలైవాస్: రూ.3.944 లక్షలు
తెలుగు టైటాన్స్ : రూ. 31.449 లక్షలు
యుముంబా : రూ.8.608 లక్షలు
యూపీ యోధాస్: రూ.12.189 లక్షలు