ప్రొ కబడ్డీలో భారత కెప్టెన్ 'విరాట్ కోహ్లీ'

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రొ కబడ్డీలో దర్శనమివ్వనున్నారు. శనివారం ముంబైలో జరిగే ప్రొ కబడ్డీ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా విరాట్ కోహ్లీ హాజరుకానున్నారు. యు ముంబా, పునేరి పల్టాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను కోహ్లీ వీక్షించనున్నారు. మ్యాచ్‌కు ముందు కోహ్లీ జాతీయ గీతం ఆలపించనున్నారు. ఈ విషయాన్ని ప్రొ కబడ్డీ యాజమాన్యం ఒక ప్రకటనలో ప్రకటించింది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ దీనికి సంబందించిన ప్రకటనను ప్రసారం చేస్తుంది.

అతిథిగా కోహ్లీ:
గతవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రొ కబడ్డీ ఏడో సీజన్ ప్రారంభమైంది. ఇక 27న ముంబైలో తొలి కబడ్డీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ హాజరుకానున్నారు. జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మ్యాచ్‌ను కూడా కోహ్లీ వీక్షిస్తాడని తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్ టూర్ ఉండడంతో ప్రస్తుతం కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. లీగ్ యాజమాన్యం కోరడంతో కోహ్లీ ఒప్పుకున్నాడని సమాచారం.

'హ్యాట్రిక్' ఓటములు:
ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో ఇప్పటివరకు పలు జట్లు అద్భుత ఆటతో ఆకట్టుకున్నాయి. కొన్ని మ్యాచ్‌లు అయితే చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగాయి. అయితే తెలుగు టైటాన్స్ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో 'హ్యాట్రిక్' ఓటములను నమోదు చేసింది. దీంతో తెలుగు అబిమానులు నిరాశగా ఉన్నారు. వచ్చే మ్యాచ్‌లో అయినా టైటాన్స్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మూడు ఫార్మాట్లకు విరాటే:
టీమిండియా ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ నుంచి వైదొలిగిన తర్వాత ఆటగాళ్లు అందరూ విడతల వారీగా స్వదేశానికి చేరుకున్నారు. వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీతో సమావేశమయ్యాడు. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. టీమిండియా ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు వెస్టిండీస్‌తో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications