తొలిసారి బరిలో తెలుగు ఆటగాళ్లు!: తెలుగు టైటాన్స్‌కు ఇద్దరు ఎంపిక

హైదరాబాద్: గత ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ ఏడో సీజన్ జులై 21న హైదరాబాద్ వేదికగా ఆరంభం కానుంది. ఐపీఎల్ తర్వాత భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీగా పీకేఎల్‌కు పేరుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అక్టోబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు గ్రేటర్ నోయిడా ఆతిథ్యమివ్వనుంది. గత సీజన్‌లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇక, హైదరాబాద్‌లో పోటీలు జులై 26 వరకు జరుగుతాయి. కాగా, ఈసారి తెలుగు టైటాన్స్‌కు ఇద్దరు తెలుగు క్రీడాకారులు శివ గణేశ్ రెడ్డి, మల్లికార్జున్ ప్రాతినిథ్యం వహించనున్నారు.
వీళ్లిద్దరికీ ఇదే తొలి ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ కావడం విశేషం. ఇటీవల ముగిసిన వేలంలో రూ.6 లక్షలకు శివ గణేష్ రెడ్డిని, రూ.10 లక్షలకు మల్లికార్జున్‌ను తెలుగు టైటాన్స్ సొంతం చేసుకుంది. తొలిసారి పీకేఎల్ ఆడబోతున్న వీరి గురించి ఒక్కసారి తెలుసుకుందాం...

శివ గణేశ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన 20 ఏళ్ల శివ గణేశ్ రెడ్డి తన పెదనాన్న కొడుకు జనార్దన్ స్ఫూర్తితో కబడ్డీని క్రీడగా ఎంచుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలో అన్నయ్య జనార్దన్ దగ్గరే శిక్షణ పొందేవాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ శిక్షణ రాటుదేలాడు. అనంతరం రాష్ట్ర స్థాయిలో టోర్నీల్లో రాణించాడు. ఈ ఏడాది సీనియర్ జాతీయ కబడ్డీ టోర్నీలో పాల్గొన్నాడు. పీకేఎల్ యాజమాన్యం యువ ఆటగాళ్ల కోసం ఏటా నిర్వహించే ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ టోర్నీలో రాణించాడు. దీంతో వేలంలో తెలుగు టైటాన్స్ అతడిని సొంతం చేసుకుంది.

పీకేఎల్‌కు ఎంపికవడంపై
పీకేఎల్‌కు ఎంపికవడంపై శివ గణేశ్ రెడ్డి మాట్లాడుతూ "మాది పేద కుటుంబం. ఆటలో రాణించి కుటుంబానికి అండగా నిలవాలి అని నిర్ణయించుకున్నా. అన్నయ్యలు జనార్దన్, శ్రీనాథ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మా అమ్మనాన్నలకు కబడ్డీ గురించి గురించి ఎక్కువగా తెలియదు. ఆటలో మంచి స్థాయికి చేరుకుని వాళ్లు సంతోషపడేలా చేస్తా" అని అన్నాడు.

మల్లికార్జున్
మల్లికార్జున్‌ది వనపర్తి జిల్లాలోని ఓ మూలమల్లు గ్రామం. ఊర్లో అందరికీ కబడ్డీ అంటే ఇష్టం. ఈ క్రమంలో మల్లికార్జున్‌కు కూడా ఆటపై ఇష్టం పెరిగింది. అంచెలంచెలుగా ఎదిగిన అతడు నాలుగు సార్లు సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి ఆటతీరును చూసి టైటాన్స్ జట్టులోకి తీసుకుంది.

రైడర్‌గా రాణిస్తూ
వ్యవసాయ నేపథ్యం కావడంతో కబడ్డీలో రైడర్‌గా రాణిస్తూన్నప్పటికీ తల్లిదండ్రులిద్దరూ పొలం పనుల్లో సాయం చేస్తుంటారు. తెలుగు టైటాన్స్‌కు ఎంపికవడంపై "చాలా ‘ఆనందంగా ఉంది. అవకాశం వస్తే పీకేఎల్‌లో సత్తాచాటుతా. దేశానికి ప్రాతినిథ్యం వహించాలనేదే నా లక్ష్యం" అని మల్లికార్జున్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications