న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తమిళనాడు సాంప్రదాయ దుస్తుల్లో రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్

PKL 2019: Rahul Chaudhari and Ajay Thakur The Thaliava way of eating out and having fun

హైదరాబాద్: భారత కబడ్డీ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్ తమిళనాడు సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. తమిళనాడులో పంచ కట్టు చాలా పాపులర్. ఏ వేడుక అయినా అక్కడి ప్రజలు పంచ కట్టులో దర్శమిస్తారు. ఇదంతా దాదాపు మనం తమిళ సినిమాలల్లో చూస్తోనే ఉంటాం. తాజాగా తమిళనాడు సాంప్రదాయ దుస్తుల్లో రాహుల్, అజయ్ మెరిశారు. ఇద్దరూ కలిసి భోజనానికి ఓ హోటల్‌కి వెళ్లిన పోటోలను వివో ప్రొ కబడ్డీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ ఇదే!!చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ ఇదే!!

సాంప్రదాయ దుస్తుల్లో సూపర్:

ఆ ఫోటోలలో రాహుల్, అజయ్ ఇద్దరు హోటల్‌లో ఆర్డర్ చేసి తాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ పోటోలను తెగ షేర్ చేస్తున్నారు. రాహుల్, అజయ్ సాంప్రదాయ దుస్తుల్లో అదిపోయారు అని కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ ఆటలోనే కాదు.. బయట కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు అని ఓ అభిమాని పోస్ట్ చేసాడు. సాంప్రదాయ దుస్తుల్లో సూపర్ అంటూ మరో అభిమాని కామెంట్ చేసాడు. సీజన్-6 వరకు తెలుగు టైటాన్స్ జట్టుకు ఆడిన రాహుల్ చౌదరి.. ఈ సీజన్-7లో తమిళ్ తలైవాస్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.

మూడు విజయాలు, ఐదు ఓటములు:

మూడు విజయాలు, ఐదు ఓటములు:

తమిళ్ తలైవాస్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచులలో మూడు విజయాలు, ఐదు ఓటములతో 25 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ 44 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. 37 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ రెండో స్థానంలో.. 36 పాయింట్లతో హరియాణా స్టీలర్స్‌, 34 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాయి. వరుస పరాజయాలతో సతమవుతున్న తెలుగు టైటాన్స్ 23 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది.

హ్యాట్రిక్‌ విజయాలు:

హ్యాట్రిక్‌ విజయాలు:

ప్రొ కబడ్డీ సీజన్‌-7లో హరియాణా స్టీలర్స్‌ దూసుకెళుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 41-25 తేడాతో గుజరాత్‌ ఫార్చ్యూన్‌జెయింట్స్‌ను ఓడించింది. దీంతో హరియాణా విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. రైడింగ్‌లో వికాస్‌ ఖండోలా (7), ప్రశాంత్‌ కుమార్‌ రాయ్‌ (8).. ట్యాక్లింగ్‌లో రవి కుమార్‌ (6) రాణించి హరియాణాకు అద్భుత విజయాన్ని అందించారు. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 40-24తో యు ముంబాను చిత్తు చేసింది. ఈ విజయంతో అతిథ్య ఢిల్లీ టాప్‌ప్లేస్‌ను ఆక్రమించింది. ఢిల్లీ రైడర్‌ నవీన్‌ కుమార్‌ (11).. డిఫెండర్లు రవిందర పహాల్‌ (8), జోగిందర్‌ నర్వాల్‌ (6) సత్తాచాటారు.

Story first published: Thursday, August 29, 2019, 16:46 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X