ఆరు ఓటముల తర్వాత గెలుపు బాట.. గుజరాత్‌పై పల్టాన్ విజయం

పుణె: ప్రొ కబడ్డీ సీజన్‌-7లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఎట్టకేకలకు పుణేరి పల్టాన్ గెలుపు బాట పట్టింది. దీంతో హోమ్‌ లెగ్‌ను పల్టన్‌ గ్రాండ్‌ విక్టరీతో ఆరంభించింది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పల్టన్‌ 43-33తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ను ఓడించింది. పుణె స్టార్‌ రైడర్‌ నితిన్‌ తోమర్‌ 11 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించాడు. డిఫెండర్లు సుర్జీత్‌, బాలాసాహెబ్‌ జాదవ్‌ హై-5తో మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచారు. గుజరాత్ జట్టులో సచిన్ సూపర్-10తో సత్తా చాటినా ఫలితం లేకుండా పోయింది.

ధర్మశాలలో తొలి టీ20: టీమిండియాకు సాంప్రదాయ స్వాగతం

మ్యాచ్ ఆరంభంలోనే నితిన్‌ తోమర్‌ విరుచుకుపడడంతో పుణె ఒక్కసారిగా 0-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గుజరాత్‌ను ఆలౌట్ చేసి 11-3తో నిలిచింది. పుణె ఆటగాళ్లు జోరు కొనసాగించడంతో ఓ దశలో ఆ జట్టు 17 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో పుంజుకున్న గుజరాత్‌ పాయింట్ల అంతరంను తగ్గించుకుంటూ వచ్చింది. అయితే పట్టువదలని పుణె మ్యాచ్ చివరకు అదే ఊపును కొనసాగించి 10 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 43-35 తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. హర్యానా స్టార్ రైడర్ వికాస్‌ ఖండోలా 13 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌ చౌదరి సూపర్‌-10 సాధించినా డిఫెన్స్‌లో వైఫల్యం తలైవాస్‌ ఓటమికి కారణమైంది. ఈ విజయంతో హర్యానా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 15, 2019, 9:46 [IST]
Other articles published on Sep 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X