ప్రొకబడ్డీ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు.. పాట్నా 'హ్యాట్రిక్' నమోదు

Pro Kabaddi League 2019:Patna Pirates Defeat Puneri Paltan 55-33

పుణె: స్టార్‌ రైడర్ పర్‌దీప్‌ నర్వాల్ (18పాయింట్లు) జోరుకు డిఫెండర్ నీరజ్ కుమార్ (11పాయింట్లు) అద్భుత ప్రదర్శన తోడవడంతో పుణేరి పల్టాన్‌పై పాట్నా పైరేట్స్ భారీ విజయం సాధించింది. ఈ విజయంతో విజయాల హ్యాట్రిక్ నమోదు చేసుకున్న పాట్నా.. ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాట్నా 55-33తో ఆతిథ్య పుణె జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. గత పుణె మ్యాచ్‌లో గెలిచిన పూణే పేలవ ఆటతో మూల్యం చెల్లించుకుంది.

దక్షిణాఫ్రికా vs భారత్ తొలి టీ20.. టాస్‌ పడకుండానే మ్యాచ్ వర్షార్పణం!!

పాట్నా డిఫెండర్ నీరజ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతని పట్టు ముందు పుణె రైడర్లు తలవంచారు. నీరజ్ 13 ప్రయత్నాల్లో 11సార్లు పుణేరి రైడర్లను పట్టేసాడు. డిఫెండర్ ఓ మ్యాచ్‌లో 5 పాయింట్లు సాధిస్తే అదే అద్భుతం. కానీ.. నీరజ్ ఏకంగా 11 పాయింట్లు సాధించడం విశేషం. ప్రొకబడ్డీ చరిత్రలో ఓ మ్యాచ్‌లో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు సాధించిన రికార్డును నీరజ్ సమం చేశాడు. పల్టన్ తరఫున మన్‌జీత్ 8, పంకజ్ 7 పాయింట్లు సాధించారు. పర్‌దీప్‌ నర్వాల్‌ 18 పాయింట్లతో మ్యాచ్ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో పట్నా పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎగబాకింది.

ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌లో ఢిల్లీ స్టార్‌ రైడర్‌ నవీన్‌ కుమార్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. వరుసగా సూపర్‌ 'టెన్‌'లు చేస్తున్ననవీన్.. మరోసారి సూపర్‌ 'టెన్‌' సాధించి అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 34-30తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ను ఓడించింది. నవీన్‌ (12 పాయింట్లు)కు తోడు ట్యాక్లింగ్‌లో విశాల్‌ (3 పాయింట్లు), జోగిందర్‌ (3 పాయిం ట్లు) సహకరించడంతో దబంగ్‌ విజయం ఖాయమైంది. ఈ విజయంతో 12 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో 'టాప్‌' ప్లేస్‌లో కొనసాగుతోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 16, 2019, 8:17 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X