న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దినేష్ కార్తీక్ అభిమాన కబడ్డీ ప్లేయర్ ఎవరో తెలుసా?

PKL 2019: India cricketer Dinesh Karthik reveals his favourite Kabaddi player

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో భాగంగా చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం తమిళ్‌ తలైవాస్‌, డిఫెండింగ్‌ చాంప్‌ బెంగళూరు బుల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ దినేష్ కార్తీక్ హాజరయ్యాడు. కబడ్డీ ఆటపై ఉన్న ప్రేమతో ఈ మ్యాచ్‌కు హాజరయి మద్దతు తెలిపాడు. లోకల్ జట్టు అయిన తమిళ్‌ తలైవాస్‌ ఆటగాళ్లను కార్తీక్ ఉత్సాహపరిచాడు.

<strong>ట్విట్టర్‌లో అనుష్క శర్మ బికినీ ఫోటో..: ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు</strong>ట్విట్టర్‌లో అనుష్క శర్మ బికినీ ఫోటో..: ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ... 'ప్రొ కబడ్డీలో నా అభిమాన జట్టు తమిళ తలైవాస్. జాతీయ కెప్టెన్ అజయ్ ఠాకూర్ నా అభిమాన ఆటగాడు' అని కార్తీక్ తెలిపాడు. భారత క్రికెట్ జట్టులో కబడ్డీ ఆడగల సమర్థుడైన ఆటగాడు ఎవరు అని అడిగినప్పుడు.. రిషబ్ పంత్ అని సమాధానం ఇచ్చాడు. 'దేశంలో క్రీడను ప్రోత్సహించడానికి పీకేఎల్ వంటి లీగ్లు దొహదం చేస్తాయి. ఐపీఎల్, ఇతర కౌంటీల నుండి ఇది నిరూపితమైంది. కబడ్డీలో మనం ప్రపంచ ఛాంపియన్. పీకేఎల్ కబడ్డీని మరొక స్థాయికి తీసుకువెళ్ళింది. భారతదేశం మొత్తంగా కబడ్డీని చూస్తున్నారు' అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

<strong>'సరైన శిక్షణ ఇస్తే బోల్ట్ రికార్డు బ్రేక్ చేస్తా'</strong>'సరైన శిక్షణ ఇస్తే బోల్ట్ రికార్డు బ్రేక్ చేస్తా'

సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 21-32తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే రైడర్ పవన్‌ షెరావత్‌ (11) అదరగొట్టడంతో బుల్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఖాతా తెరిచేందుకే నానా తంటాలు పడ్డ తలైవాస్‌.. బుల్స్ రైడర్ పవన్ షెరావత్ ధాటికి ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఆలౌటయ్యారు. దీంతో ఒక్కసారిగా బుల్స్ 10-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో తలైవాస్‌ రైడర్ మోహిత్‌ చిల్లార్‌ మెరుపు రైడ్లు చేయడంతో తమిళ్‌ జట్టు 17-19తో బెంగళూరును సమీపించింది. బెంగళూరు మరోసారి ఊపును కొనసాగించి తలైవాస్‌ను అడ్డుకుంది. ఎప్పటికప్పుడు ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వెళ్లిన బుల్స్.. తలైవాస్‌కు అవకాశం ఇవ్వలేదు.

Story first published: Monday, August 19, 2019, 15:52 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X