
హైదరాబాద్: ప్రొ కబడ్లీ లీగ్ సీజన్-7లో దబాంగ్ ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. విజేత ఎవరో తేలడానికి చివరి కూత వరకు వేచిచూడాల్సి వచ్చింది. గురువారం రాత్రి ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో తమిళ్ తలైవాస్‌పై 30-29 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో రాహుల్ చౌదరి (7 పాయింట్లు) తొలుత దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి తమిళ్ తలైవాస్ 18-11 పాయింట్లతో నిలిచింది. మరోవైపు అజయ్ ఠాకూర్ (5), మంజీత్ చిల్లర్ (5) పాయింట్లు సాధించారు. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో తమిళ్ తలైవాస్ అనవసరపు తప్పిదాలకు పాల్పడింది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
దీంతో 21-28తో వెనకబడ్డ ఢిల్లీ రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది. దబాంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ సూపర్‌రైడ్‌తో అజీత్, వినీత్, రణ్‌సింగ్‌ను ఔట్ చేయడంతో ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అదే సమయంలో డూఆర్‌డై రైడ్‌కు వెళ్లిన అజయ్ ఠాకూర్‌ను విశాల్ మానె అద్భుతంగా ట్యాకిల్ చేయడంతో తలైవాస్ ఆలౌటైంది.
ఆ తర్వాత నవీన్ కూతకు వెళ్లి అజీత్‌ను ఔట్ చేయడంతో స్కోరు 28-29గా మారింది. చివర్లో మరోసారి కూతకువెళ్లిన అజయ్‌ను నవీన్ కుమార్ పట్టుకోవడంతో స్కోరు 29-29తో సమం అయింది. మ్యాచ్ విజేతన డిసైడ్ చేసే చివర కూతలో మంజీత్ చిల్లర్ బాక్స్ దాటడంతో తమిళ్ తలైవాస్ ఓడింది. దబాంగ్ ఢిల్లీ 13 రైడ్ పాయింట్లు, 9 టాకిల్ పాయింట్లు సాధించింది.
ఇక, తమళ్ తలైవాస్ 12 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించి ఓటమిపాలైంది.