Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2019: విజయంతో వీడ్కోలు పలికిన తెలుగు టైటాన్స్

PKL 2019, Day 70 highlights: Titans beat UP Yoddha 41-36 in a thriller

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ విజయంతో ముగించింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న తెలుగు టైటాన్స్ బుధవారం జరిగిన పోరులో టైటాన్స్‌ 41-36తో యూపీ యోధపై విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ రైడర్ సిద్ధార్థ్‌ దేశాయ్‌ ప్రదర్శన ఆకట్టుకుంది.

15 సార్లు రైడింగ్‌ వెళ్లిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ 15 పాయింట్లు సాధించాడు. దీంతో టైటాన్స్‌ తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ (15) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యూపీ యోధ జట్టులో శ్రీకాంత్‌ జాదవ్‌ (8), రిషాంక్‌ దేవడిగ (8) అదరగొట్టారు. సుమిత్‌ (5), మోను గోయత్‌ (4), నితీశ్‌ కుమార్‌ (4)లు ఫరవాలేదనిపించారు.

మొత్తం మీద ఈ సీజన్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 45 పాయింట్లు సాధించి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 4 విజయాలతో తమిళ్‌ తలైవాస్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 33-29తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది.

ప్రో కబడ్డీలో గురువారం
యు ముంబా vs హరియాణా స్టీలర్స్‌

Story first published: Thursday, October 10, 2019, 7:34 [IST]
Other articles published on Oct 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+