టేబుల్ టాపర్ ఢిల్లీతో జైపూర్ ఢీ.. ఢిల్లీ ఫామ్‌ను కొనసాగించేనా?

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్-7లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్‌లు బెంగళూరు అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఒక్కో జట్టు లీగ్ దశలో సగం మ్యాచులను పూర్తి చేసుకున్నాయి. లీగ్ ఆరంభంలో జైపూర్ పింక్ పాంథర్స్ హవా కొనసాగగా.. ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు దూసుకుపోతున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ సొంత గడ్డపై వరుస విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. వారం రోజుల క్రితం టాపర్‌గా నిలిచిన జైపూర్ అనూహ్యంగా ఓడిపోయి ఐదో స్థానంలోకి పడిపోయింది. అయితే ఈ రోజు ఢిల్లీని జైపూర్ ఢీకొట్టనుంది. అద్భుత ఆటతీరు కనబరుస్తున్న ఢిల్లీ పటిష్ట జైపూర్ జట్టుపై విజయం సాధిస్తుందా అనేది సందేహంగా మారింది. ఢిల్లీ తమ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలి చూస్తోండగా.. విజయం సాధించి గెలుపు బాట పట్టాలని జైపూర్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
జైపూర్ జట్టులో కెప్టెన్ దీపక్ హూడా, నితిన్ రావల్, దీపక్ నార్వాల్, అజింక్య పవార్ కూడా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్ ధుల్, అమిత్ హుడాలు కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్, మెరాజ్ షేక్, రవీందర్ పహల్, జోగిందర్ నర్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇరు జట్లు కూడా రైడర్, ఢిఫెండర్లతో పటిష్టంగా ఉంది.
ఈ సీజన్‌లో రైడర్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. పవన్ కుమార్ సెరావత్, నవీన్ కుమార్, పర్దీప్ నర్వాల్, సిద్దార్థ్ దేశాయ్, మణిందర్ సింగ్ లాంటి రైడర్‌లు టాప్ 5లో ఉన్నారు. వీరందరు తమ తమ జట్లకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెడుతున్నారు. ఈ సీజన్‌లో 100 రైడ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా బెంగళూరు బుల్స్ అగ్రశ్రేణి రైడర్ పవన్ కుమార్ సెరావత్ నిలిచాడు. అనంతరం ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ 100 రైడ్ పాయింట్లు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications