నవీన్ సూపర్ షో: జైపూర్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. నవీన్ కుమార్ సూపర్ షోతో ఈ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ వరుసగా ఐదో విజయం సాధించింది. గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు అపజయమేనేది లేకుండా సాగుతోంది. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 46-44తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది.
నవీన్ కుమార్ (16) పాయింట్లతో మరోసారి రైడింగ్‌లో చెలరేగగా... చంద్రన్ రంజిత్ (8 పాయింట్లు), జోగిందర్ నర్వాల్ (3 పాయింట్లు) చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా (11 పాయింట్లు) మళ్లీ ఫామ్‌లోకి వచ్చినా జట్టును గెలిపించలేక పోయాడు. ముఖ్యంగా కీలక సమయాల్లో ఒత్తిడి లోనై వరుసగా నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

మ్యాచ్ ఆరంభంలోనే
మ్యాచ్ ఆరంభంలోనే చంద్రన్ రంజిత్ చెలరేగడంతో రెండో నిమిషంలోనే ఢిల్లీ 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రెండు నిమిషాల తేడాతో జైపూర్‌ను ఆలౌట్ చేసింది. అయితే, 12వ నిమిషంలో దీపక్ నర్వాల్ ఒకే రైడ్‌లో ఐదు పాయింట్లు తేవడంతో జైపూర్ అనూహ్యంగా 15-16తో పుంజుకుంది. ఆ తర్వాత రెండు జట్లూ పాయింట్ల కోసం నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి.

ఢిల్లీ 21-19తో ఆధిక్యంలో
దీంతో తొలి అర్దభాగం ముగిసే సరికి ఢిల్లీ 21-19తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్దభాగంలో ఢిల్లీ రైడర్లు మరోసారి విజృంభించారు. అయితే, సచిన్ నర్వాల్ కీలక సమయంలో రెండు పాయింట్లు తెచ్చి జైపూర్ ఆలౌట్ కాకుండా అడ్డుకున్నాడు. కాగా, 32వ నిమిషంలో ఢిల్లీని ఆలౌట్ చేసి 35-29తో పైచేయి సాధించింది.

నవీన్ వరుసగా పాయింట్లు తెస్తూ
ఆ తర్వాత నవీన్ వరుసగా పాయింట్లు తెస్తూ ఢిల్లీని రేసులోకి తెచ్చాడు. ఆఖరి నిమిషాల్లో పాంథర్స్ రైడర్ విజయ్ మూడు రైడ్ పాయింట్లు తీసుకురావడంతో ఢిల్లీ స్కోరు సమం చేసే విధంగా కనిపించింది. అదే సమయంలో ఢిల్లీ 42-43తో వెనుకబడినప్పటికీ పాంథర్స్‌ను ఆలౌట్ చేసిన ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. చివరి నిమిషంలో ఉత్కంఠ రేగినా చివరకు మ్యాచ్‌ని ఢిల్లీనే కైవసం చేసుకుంది.

12 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో 54 పాయింట్లు
తాజా విజయంతో 12 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో 54 పాయింట్లు సొంతం చేసుకున్న ఢిల్లీ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్ 40-39 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ఆ జట్టు రైడర్ పవన్ సెరావత్ (17) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రొ కబడ్డీలో గురువారం
పుణెరి vs యు ముంబా (రాత్రి 7:30 నుంచి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications