న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'బాహుబలి' సిద్ధార్థ్ వీరవిహారం.. తెలుగు టైటాన్స్ విజయం

PKL 2019: Baahubali Siddharth Desai’s masterclass gives Telugu Titans win over Haryana Steelers

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ రెండో విజయాన్ని అందుకుంది. కబడ్డీ 'బాహుబలి' సిద్ధార్థ్‌ దేశాయ్‌ ఈ సీజన్‌లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో ఆదివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 40-29తో హరియాణా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. ప్రస్తుతం 18 పాయింట్లు ఖాతాలో ఉన్న టైటాన్స్ పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది. టైటాన్స్‌ స్టార్‌ రైడర్‌ సిద్దార్థ్‌ దేశాయ్‌ 18 రైడ్లలో 18 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

<strong>బాల్‌ ట్యాంపరింగ్‌ సెగ.. స్మిత్‌ను ఎగతాళి చేసిన వారు క్రికెట్‌ లవర్సే కాదు</strong>బాల్‌ ట్యాంపరింగ్‌ సెగ.. స్మిత్‌ను ఎగతాళి చేసిన వారు క్రికెట్‌ లవర్సే కాదు

సిద్దార్థ్ సూపర్-10:

మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీ పడ్డాయి. అయితే సూరజ్, సిద్ధార్థ్‌ చెలరేగడంతో మొదటి 10 నిమిషాల తరువాత తెలుగు టైటాన్స్ 9-6 ఆధిక్యంలోకి వచ్చింది. టైటాన్స్‌ అదే జోరును కొనసాగిస్తూ.. తొలి అర్ధ భాగంలో 21-13తో ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండవ సగం మొదటలో ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్లను సాధించారు. కానీ సిద్దార్థ్ చెలరేగి సూపర్ టెన్ సాధించడంతో హరియాణా మరోసారి ఆలౌట్ అయింది. సిద్దార్థ్ వరుస రైడ్లతో టైటాన్స్‌ను 31-16తో మెరుగైన స్థితికి చేర్చాడు.

వికాశ్‌ చెలరేగినా:

వికాశ్‌ చెలరేగినా:

హర్యానా స్టీలర్స్ తిరిగి పోటీలో పాల్గొనడానికి ప్రయత్నించింది. అయితే టైటాన్స్ రెండు విభాగాల్లో సత్తా చాటడంతో హరియాణా కోలుకోలేకపోయింది. వికాశ్‌ ఖండోలా చెలరేగినా.. మరోవైపు సిద్ధార్థ్‌ పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్ళింది. కొన్ని నిమిషాలలో మ్యాచ్ ముగుస్తుందనగా ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆడిన టైటాన్స్ 11 పాయింట్లతో విజయాన్ని నమోదు చేసింది.

మరోసారి నలుపు దుస్తుల్లో:

నలుపు దుస్తుల్లో బరిలో దిగిన మొదటి మ్యాచ్‌లోనూ గెలిచిన టైటాన్స్.. మరోసారి నలుపు దుస్తుల్లో ఆడి ఆకట్టుకుంది. ప్రత్యర్థి కోర్టులో వీరవిహారం చేసిన సిద్ధార్థ్ టైటాన్స్‌ను ముందుండి నడిపించాడు. అతడికి సూరజ్ దేశాయ్ (6 పాయిం ట్లు) సహకారం అందించాడు. వికాశ్‌ ఖండోలా (9) రాణించినా.. టైటాన్స్‌ జోరును ఆపలేకపోయాడు.

Story first published: Monday, August 19, 2019, 8:29 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X