న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీడా దినోత్సవం రోజు అజయ్ ఠాకూర్‌కు అర్జున అవార్డు

PKL 2019: Ajay Thakur to be presented with the prestigious Arjuna Award this year

చెన్నై: భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌, ప్రో కబడ్డీ ఐస్ మాన్ అజయ్ ఠాకూర్‌కు అర్జున అవార్డు లభించిన విషయం తెలిసిందే. అజయ్ ఠాకూర్‌తో పాటు మరో 18 మందికి అర్జున పురస్కారాలను ప్రకటించారు. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ, విశేష సేవలు అందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డులను అందిస్తారు. క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగష్టు 29న అజయ్ ఠాకూర్‌కు అర్జున అవార్డును ప్రదానం చేయనున్నారు.

'ఆర్చర్‌ ఇంగ్లండ్‌కు గొప్ప ఆయుధం.. అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి'

కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ టోర్నీలో కీలక పాత్ర పోషించిన ఠాకూర్‌కు భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కూడా ప్రదానం చేశారు. గత 15 సంవత్సరాలుగా కబడ్డీ ఆడుతున్న ఠాకూర్ టాప్-క్లాస్ ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. 2016 కబడ్డీ ప్రపంచకప్‌లో ఠాకూర్‌ నేతృత్వంలో భారత జట్టు కప్ సాధించింది. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఠాకూర్‌ ఉత్తమ రైడర్ అవార్డును అందుకున్నాడు.

ఒకవైపు జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ.. మరోవైపు ప్రొ కబడ్డీలో తమిళ్‌ తలైవాస్‌ కెప్టెన్‌గా వ్యహస్తరిస్తున్నాడు. తలైవాస్‌ జట్టును సమర్ధంగా నడిపిస్తూ తనదైన ముద్ర వేసాడు. అయితే శనివారం సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 21-32తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే రైడర్ పవన్‌ షెరావత్‌ (11) అదరగొట్టడంతో బుల్స్ సునాయాస విజయాన్ని అందుకుంది.

ఖాతా తెరిచేందుకే నానా తంటాలు పడ్డ తలైవాస్‌.. బుల్స్ రైడర్ పవన్ షెరావత్ ధాటికి ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఆలౌటయ్యారు. దీంతో ఒక్కసారిగా బుల్స్ 10-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో తలైవాస్‌ రైడర్ మోహిత్‌ చిల్లార్‌ మెరుపు రైడ్లు చేయడంతో తమిళ్‌ జట్టు 17-19తో బెంగళూరును సమీపించింది. బెంగళూరు మరోసారి ఊపును కొనసాగించి తలైవాస్‌ను అడ్డుకుంది. ఎప్పటికప్పుడు ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వెళ్లిన బుల్స్.. తలైవాస్‌కు అవకాశం ఇవ్వలేదు.

Story first published: Tuesday, August 20, 2019, 17:10 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X