PKL 2019: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ జరిగేది ఎక్కడో తెలుసా?

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్ ప్లేఆఫ్స్, పైనల్ మ్యాచ్‌లకు అహ్మాదాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు మంగళవారం వివో ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) ఆర్గనైజర్ మాషల్ స్పోర్ట్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 19 వరకు జరగనున్న ప్లేఆఫ్స్, పైనల్ మ్యాచ్‌లకు అహ్మాదాబాద్‌లోని EKA ఎరీనా ఆతిథ్యమిస్తోంది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో భాగంగా రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, రెండు సెమీపైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయి.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ఇప్పటికే 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి... ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ప్రస్తుతం30 పాయింట్లతో పట్టికలో తెలుగు టైటాన్స్ 9వ స్థానంలో కొనసాగుతోంది.
ప్రో కబడ్డీ ఏడో సీజన్ ప్లేఆఫ్స్ షెడ్యూల్:
14th October (Monday):
Match 1: Eliminator 1: League Rank 3 vs League Rank 6
Match 2: Eliminator 2: League Rand 4 vs League Rank 5
16th October (Wednesday):
Match 1: Semifinal 1: League Rank 1 vs Winner of Eliminator 1
Match 2: Semifinal 2: League Rank 2 vs Winner of Eliminator 2
19th October (Saturday): Final
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications