కుమార్తెతో కలిసి మ్యాచ్‌కి హాజరైన ఐశ్యర్య: యు ముంబా చేతిలో జైపూర్ ఓటమి


హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్‌లో యు ముంబా జట్టు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. అనూప్ కుమార్ చివరి సీజన్ వరకు యు ముంబా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాదు ఆ జట్టుని మూడుసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంతో పాటు ఓసారి టైటిల్‌ను అందించాడు.
అయితే, బుధవారం జరిగిన పోరులో మాత్రం అందుకు భిన్నం. ఈసారి ప్రత్యర్థిగా బరిలో దిగాడు. జోన్-ఎలో మాజీ ఛాంపియన్‌ల మధ్య ప్రొకబడ్డీ మ్యాచ్ అంచనాలకు తగ్గట్టుగానే నువ్వానేనా అన్నట్టుగా సాగింది. అయితే ఆఖర్లో అదరగొట్టిన యు ముంబా లీగ్‌లో తొలి విజయాన్న నమోదు చేసింది. మ్యాచ్‌లో 39-32తో పింక్ పాంథర్స్‌ను ఓడించింది.

13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర
చివర్లో దూకుడుగా ఆడిన సిద్ధార్థ్ దేశాయ్ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి 5 నిమిషాల వరకు పాంథర్స్‌దే విజయమని అంతా భావించారు. అప్పటివరకు మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు 30-27తో ఆధిక్యంలో నిలిచింది. చివర్లో యు ముంబా ఆటగాళ్లు విజృంభించి జట్టుకు విజయాన్ని అందించారు.
తొలి అర్దభాగంలో 11-5తో స్పష్టమైన ఆధిక్యం
తొలి అర్దభాగంలో యు ముంబా జట్టును ఆలౌట్ చేసిన పాంథర్స్ జట్టు 11-5తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు అటాకింగ్‌పై దృష్టిసారిస్తే.. పాంథర్స్ డిఫెన్స్‌తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. మ్యాచ్‌లో 30 నిమిషాల పాటు ఇలానే ఆడారు. ఆ తర్వాత సిద్ధార్థ్ దేశాయ్ దూకుడుగా ఆడటంతో పాంథర్స్ క్రమంగా అధిక్యాన్ని కోల్పోయింది.

మ్యాచ్‌ని తిలకించిన అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యరాయ్
యు ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (13 పాయింట్లు) అదరగొట్టాడు. రోహిత్ బలియన్ 7 పాయింట్లు సాధించాడు. పింక్‌పాంథర్స్ జట్టులో నితిన్ (8) రాణించాడు. అనూప్ 4, మోహిత్, సందీప్ ధుల్, అమిత్ తలా 3 పాయింట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యరాయ్ ఆసక్తిగా తిలకించారు.

బెంగళూరు బుల్స్‌ని ఓడించిన తమిళ్ తలైవాస్
జోన్-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48-37తో తమిళ్ తలైవాస్‌ను ఓడించి లీగ్‌లో శుభారంభం చేసింది. పవన్ షెరావత్ 20 పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాశీలింగ్ అడకె 9 పాయింట్లు సాధించాడు. తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ (20) ఒంటరి పోరాటం వృథా అయ్యింది.

ప్రొకబడ్డీలో ఈరోజు
యూపీ యోధ × పట్నా పైరేట్స్
(రాత్రి 8 నుంచి)
తమిళ్ తలైవాస్ × బెంగాల్ వారియర్స్
(రాత్రి 9 నుంచి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications