ప్రో కబడ్డీ: యూపీ యోధపై తమిళ్ తలైవాస్ అలవోక విజయం

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఆరో సీజన్‌లో తమిళ్ తలైవాస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నోయిడా వేదికగా శుక్రవారం యూపీ యోధాతో జరిగిన మ్యాచ్‌లో 46-24 తేడాతో తలైవాస్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో తలైవాస్‌కు ఇది మూడో విజయం కాగా.. యూపీ యోధకు నాలుగో ఓటమి.

తమిళ్ తలైవాస్ అలవోక విజయం
రైడింగ్‌లో అజయ్ ఠాకూర్, సుఖేశ్ హెగ్డే, ట్యాక్లింగ్‌లో మన్‌జీత్ చిల్లర్, అమిత్ హుడా చెలరేగారు. అజయ్ సుఖేశ్ చెరో 9 రైడ్ పాయింట్లు ... మన్‌జీత్ 8, అమిత్ 6 ట్యాకిల్ పాయింట్లు సాధించడంతో తలైవాస్ సునాయాసంగా నెగ్గింది. మరోవైపు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

మ్యాచ్ ఆరంభం నుంచే తలైవాస్ దూకుడు
మ్యాచ్ ఆరంభం నుంచి తలైవాస్ దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 26-11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత సుఖేశ్ హెగ్డే వరుస పాయింట్లతో చెలరేగాడు. దాంతో ఏ దశలోనూ తలైవాస్ జోరు తగ్గలేదు. ఇక, రెండో అర్ధభాగంలోనూ తమిళ్ తలైవాస్ అదే జోరుని కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది.

మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ విజయం
యూపీ యోధ తరఫున ప్రశాంత్ కుమార్ రాయ్ 7 రైడ్ పాయింట్లు సాధించాడు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ 36-25తో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను ఓడించింది. గుజరాత్ తరపున సచిన్ (6), సునీల్ కుమార్ (8).. జైపూర్ జట్టులో నితిన్ (4), యంగ్ చంగ్ (5) పాయింట్లు సాధించారు.

ప్రొ కబడ్డీలో శనివారం
యు ముంబా Vs పుణెరి పల్టాన్ (రాత్రి 8 గంటలకు)
యూపీ యోధ Vs బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications