Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ: టైటాన్స్‌ మరో ఓటమి, ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం!

Pro Kabaddi 2018 : Telugu Titans vs Puneri Paltan Highlights | Oneindia Telugu
PKL 2018: Puneri Paltan finish their season with a comprehensive win over Telugu

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌ను కోల్పోయి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జోన్‌ 'బి'లో భాగంగా శుక్రవారం కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 20-35తో పుణేరి పల్టాన్‌ చేతిలో ఓడిపోయింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి పూర్తిగా విఫలమవడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్‌లో 12 రైడ్లు చేసిన అతను కేవలం ఒక్క పాయింట్‌ మాత్రమే సాధించాడు. తొలి అర్ధ భాగంలో పుణె డిఫెండర్లు రవి కుమార్‌ (5), రింకు నర్వాల్‌ (5), సందీప్‌ నర్వాల్‌ (4) ఉడుం పట్టు పట్టడంతో టైటాన్స్‌ రైడర్లు పాయింట్లు సాధించలేకపోయారు. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లో పుణేరి పల్టన్‌ అదరగొట్టింది.

రెండో అర్ధభాగంలో పుణె రైడర్‌ జీబీ మోరే (10) పాయింట్లతో మెరగా రవికుమార్, రింకూ నర్వాల్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. ఇక, తెలుగు టైటాన్స్‌ తరఫున ఫర్హద్‌ 5, నీలేశ్‌ 3 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 27-24తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది.

ప్రో కబడ్డీలో శనివారం
యూ ముంబా Vs యూపీ యోధా, రాత్రి 8 గంటలకు
బెంగాల్‌ వారియర్స్‌ Vs పట్నా పైరేట్స్‌, రాత్రి 9 గంటలకు

Story first published: Saturday, December 22, 2018, 9:10 [IST]
Other articles published on Dec 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+