Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ: నర్వాల్ అదుర్స్, జైపుర్‌పై పట్నా పైరేట్స్‌ విజయం

PKL 2018: Patna Pirates thump Jaipur Pink Panthers by 41-30

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం సొంత గడ్డపై జరిగిన పోరులో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను మట్టి కరిపించింది. పట్నా రైడర్లు ప్రదీప్‌ నర్వాల్‌ (11 పాయింట్లు), మంజీత్‌ (9) రాణించడంతో 41-30తో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది.

ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో జైపూర్‌ 2-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో పట్నా కెప్టెన్ పర్‌దీప్‌ విజృంభించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. నాలుగో నిమిషంలో విజయవంతంగా రైడ్‌ పూర్తి చేసిన అనూప్‌ కుమార్‌ కెరీర్‌లో 500 రైడ్‌ పాయింట్ల మార్కును అందుకున్నాడు.

పర్‌దీప్‌ వరుస రైడ్లతో పట్నాకు పాయింట్లు

పర్‌దీప్‌ వరుస రైడ్లతో పట్నాకు పాయింట్లు

ఆ తర్వాత రైడర్‌ పర్‌దీప్‌ వరుస రైడ్లతో పట్నాకు పాయింట్లు తీసుకొచ్చి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. మరోవైపు దీపక్‌ హుడా కూడా మెరవడంతో పట్నా 20-14తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి పట్నా పైరేట్స్ 22-15తో మ్యాచ్‌పై పట్టు సాధించింది.

జైపూర్‌ను నాలుగుసార్లు ఆలౌట్‌ చేసిన పట్నా

జైపూర్‌ను నాలుగుసార్లు ఆలౌట్‌ చేసిన పట్నా

30వ నిమిషంలో జైపూర్‌ను ఆలౌట్‌ చేయడం ద్వారా 33-21తో విజయానికి చేరువైంది. ఈ దశలో అనూప్‌ సూపర్‌ రైడ్‌ చేసినా.. మంజీత్‌ విజృంభించడంతో పట్నా 41-30తో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో జైపూర్‌ను పట్నా నాలుగుసార్లు ఆలౌట్‌ చేయడం విశేషం. ఈ మ్యాచ్‌‌లో కెప్టెన్‌ పర్‌దీప్ నర్వాల్‌ 11, మన్‌జీత్‌ 10 రైడ్‌ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో వికాస్‌ కాలె(5) సత్తా చాటారు.

మరో మ్యాచ్‌లో తలైవాస్‌పై 36-25తో గుజరాత్‌ విజయం

మరో మ్యాచ్‌లో తలైవాస్‌పై 36-25తో గుజరాత్‌ విజయం

ఇక, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తరఫున దీపక్‌ 7 రైడ్‌ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో సునీల్‌ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 36-25తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. స్కోరు 12-12 వరకు సమంగానే సాగింది. అక్కడ నుంచి గుజరాత్‌ రైడర్లు విజృంభించారు.

ప్రొ కబడ్డీలో శనివారం

ప్రొ కబడ్డీలో శనివారం

జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ Vs బంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 8 నుంచి)

పట్నా పైరేట్స్‌ Vs యు ముంబా (రాత్రి 9 నుంచి)

Story first published: Saturday, October 27, 2018, 9:58 [IST]
Other articles published on Oct 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+