ప్రో కబడ్డీ: ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం పట్నాదే


హైదరాబాద్: ప్రో కబడ్డీ ఆరో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తొలి విజయం నమోదు చేసింది. జోన్-బిలో గురువారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో యూపి యోధాపై 43-41 స్కోరుతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. పట్నా తరుపున పర్‌దీప్ నర్వాల్ అద్భుతంగా ఆడి 16 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక, యుపి యోధాలో శ్రీకాంత్ జాదవ్ 12 పాయుంట్లు సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ పట్నా డిఫెన్స్ విభాగం అద్భుత ప్రదర్శన చేసింది. ఆట మొదలైన రెండు నిమిషాలకే యూపి 4-1 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మూడో నిమిషంలో పర్‌దీప్ తన తొలి పాయింట్ సాధించడంతో పట్నా 3-5కు తన ఆధిక్యాన్ని తగ్గించింది.

యుపి మళ్లీ ఆధిక్యంలోకి
ఈ సమయంలో రిషాంక్ దేవడిగ రెండు పాయింట్లు తేవడంతో యుపి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు రైడ్లలో పర్‌దీప్ నర్వాల్ మూడు పాయింట్లు రాబట్టడంతో ప్రత్యర్థి ఆధిక్యాన్ని పట్నా పైరేట్స్ ఒక పాయింట్‌కు తగ్గించగలిగింది. 14వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి యోధా 20-15 ఆధిక్యంలో నిలిచింది.

తొలి అర్దభాగం మరో ఐదు నిమిషాల్లో
తొలి అర్దభాగం మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనుకున్న సమయంలో పట్నా ఆరు పాయింట్లు చేజిక్కించుకొని 21-20తో ముందంజ వేసింది. ఇక, రెండో అర్ధభాగంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన పట్నా 14-21తో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది.

ఆట చివర్లో ఇరు జట్లూ డిఫెన్స్, అటాకింగ్ గేమ్‌తో
ఆట చివర్లో ఇరు జట్లూ డిఫెన్స్, అటాకింగ్ గేమ్‌తో పాయింట్లు రాబట్టడంతో మ్యాచ్ నువ్వా-నేనా అనేలా సాగింది. చివరకు విజయం పట్నానే వరించింది. ఇదిలా ఉంటే, ఇదే జోన్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 36-27 స్కోరుతో తమిళ్ తలైవాస్‌ను చిత్తుగా ఓడించింది.

ప్రొ కబడ్డీలో ఈరోజు
హరియాణా x గుజరాత్ (రాత్రి 8 గం)
పుణెరి x ఢిల్లీ (రాత్రి 9 గం)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications