ప్రో కబడ్డీ: అదరగొట్టిన జైపూర్, టోర్నీలో ఐదో విజయం

హైదరాబాద్: హర్యానాలోని పంచకుల వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై జైపూర్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జోన్ 'ఎ'లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36-23తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది.
రైడింగ్‌లో ఇరు జట్లు సత్తా చాటినా ట్యాక్లింగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ అదరగొట్టింది. పింక్ పాంథర్స్ తరఫున రైడింగ్‌లో దీపక్ హుడా (8), ట్యాక్లింగ్‌లో సునీల్ (8) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. అయితే పదో నిమిషంలో దీపక్ రెండు పాయింట్లతో జైపూర్ 9-7తో ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత నుంచి ఆ జట్టుకు వెనుదిరిగి చూడలేదు. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరే, సందీప్ నర్వాల్ ఐదేసి పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 28-21తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. బెంగాల్ జట్టులో మణిందర్ సింగ్ (7), సుర్జీత్ సింగ్ (6) రాణించారు. తలైవాస్ తరపున అమిత్ హుడా (7) ట్యాక్లింగ్‌లో సత్తాచాటాడు.
ప్రో కబడ్డీలో శనివారం
యూపీ యోధా Vs తమిళ్ తలైవాస్
జైపూర్ పింక్ పాంథర్స్ Vs యు ముంబా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications