ప్రొ కబడ్డీ: సొంత ప్రేక్షకుల మధ్య తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి


హైదరాబాద్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నిరాశజనక ప్రదర్శన చేస్తోంది. తాజాగా మరో ఓటమి ఎదురైంది. వేదిక మారినా తెలుగు టైటాన్స్ కూత మారడంలేదు. ట్యాక్లింగ్‌తో పాటు రైడింగ్‌లో విఫలమైన టైటాన్స్ సొంత ప్రేక్షకుల మధ్య కూడా సత్తా చాటలేక వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.
దీంతో గ్రూప్-బిలో చివరి స్థానంలోనే కొనసాగుతోంది. ఇంటర్ జోన్ చాలెంజ్ వీక్‌లో భాగంగా రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 27-29తో గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్ చేతిలో ఓడింది. గుజరాత్ రైడర్స్ ప్రపంజన్ (10), సచిన్ (9)ను నిలువరించడంలో టైటాన్స్ డిఫెండర్స్ విఫలమయ్యారు.

నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్
గుజరాత్ రైడర్లు ప్రపంజన్ (10), సచిన్ (9) పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆరంభంలో గుజరాత్-టైటాన్స్ నువ్వానేనా అన్నట్లు పోరాడాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జెయింట్స్ తొలి నిమిషంలోనే 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్ 17-12తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో పుంజుకున్న తెలుగు టైటాన్స్
అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న టైటాన్స్ వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని 19-17కు తగ్గించింది. రాహుల్ చౌదరి 8, నీలేశ్ 4, ఫర్హాద్ 3 పాయింట్లతో చెలరేగారు. ఓ దశలో 26-23తో ఆధిక్యంలోకి వచ్చింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... అనూహ్యంగా తడబడి ఓటమి మూటగట్టుకుంది.

కీలక సమయంలో రాహుల్ చౌదరి ఔట్
కానీ, కీలక సమయంలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఔట్ కావడం... చివర్లో ప్రత్యర్థి ఆటగాళ్లను ట్యాకిల్ చేయడంలో విఫలమై మ్యాచ్‌ను చేజార్చుకుంది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 10 పాయింట్లతో మెరవగా... టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్‌కు ఈ సీజన్లో సొంతగడ్డపై ఇదే తొలి మ్యాచ్.

మరో మ్యాచ్‌లో పుణెరిపై పట్నా పైరేట్స్ విజయం
మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 53-36తో పుణెరి పల్టాన్‌పై ఘన విజయం సాధించింది.. పట్నా తరఫున పర్‌దీప్ నర్వాల్ 27 పాయింట్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మంజిత్ 6, వికాస్ 2, జైదీప్ 2 పాయింట్లు సాధించారు. పుణె జట్టులో మోరె 13, సందీప్ 7, పర్వేశ్ 2 పాయింట్లు తెచ్చినా లాభం లేకపోయింది.

ప్రొ కబడ్డీలో శనివారం
యు ముంబా Vs బంగాల్ (రా.8 నుంచి)
టైటాన్స్ Vs జైపుర్ (రా.9 నుంచి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications