ప్రో కబడ్డీ: సొంతగడ్డపై ఎదురులేని గుజరాత్, బెంగాల్‌పై విజయం


హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇంటర్ జోన్ ఛాలెంజ్ మ్యాచ్‌లో గుజరాత్ 35-23తో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ జట్టులో ప్రపంజన్ (9 పాయింట్లు) రాణించాడు.
ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన ఫార్చూన్ జెయింట్స్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 19-14తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ బాగా ఆడింది తొలి పది నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత మొత్తం గుజరాత్ హవా కొనసాగింది. ఆరంభంలో అజయ్, మణీందర్ వరుస పాయింట్లు సాధించడంతో ఆరంభంలో బెంగాల్ గట్టి పోటీ ఇచ్చింది.

ప్రపంజన్ అద్ఫుత ప్రదర్శన
ప్రపంజన్ అద్ఫుత ప్రదర్శన చేయడంతో గుజరాత్ 6-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మణీందర్ మరోసారి రైడ్ పాయింట్ తేవడంతో 9-8తో బెంగాల్ ఆధిక్యంలోకి వెళ్లింది. 14వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన గుజరాత్ 14-11తో ఆధిక్యంలో నిలిచింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్ 19-14తో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ గుజరాత్ దూకుడు
రెండో అర్ధభాగంలో గుజరాత్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాస విజయం సాధించింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 9, అజయ్ 6 పాయింట్లు సాధించారు. గుజరాత్ జట్టులో ప్రపంజన్‌తో పాటు ట్యాకిలింగ్‌లో పర్వేశ్ (4) అదరగొట్టాడు. బెంగాల్ తరఫున మణిందర్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లు సాధించారు.

మరో మ్యాచ్‌లో యూపీ యోధపై జైపూర్ విజయం
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 45-28తో యూపీ యోధపై విజయం సాధించింది. జైపూర్ జట్టులో దీపక్ హుడా (10 రైడింగ్ పాయింట్లు), సునీల్ (5 ట్యాకిల్ పాయింట్లు)లతో సత్తా చాటారు. వరుసగా రెండు ఓటములతో తర్వాత జైపూర్‌కు ఇదే తొలి విజయం కాగా, యూపీ యోధకు ఇది హ్యట్రిక్ ఓటమి కావడం విశేషం.

ప్రొ కబడ్డీలో శనివారం
పుణెరి Vs బంగాల్ (రాత్రి 8 గంటల నుంచి)
గుజరాత్ Vs బెంగళూరు (రాత్రి 9 గంటల నుంచి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications