ప్రొ కబడ్డీ: సొంతగడ్డపై సత్తా చాటిన దబంగ్ ఢిల్లీ (ఫోటోలు)

హైదరాబాద్: సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ అద్బుత విజయం సాధించింది. రైడింగ్‌లో మిరాజ్ షేక్ (15) చెలరేగడంతో జోన్ 'ఎ'లో భాగంగా శుక్రవారం జైపుర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 48-35 తేడాతో విజయం సాధించింది. రెండు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఢిల్లీ రైడర్లు మీరా జ్ షేక్ (15), నవీన్ కుమార్ (9) పోటాపోటీ గా పాయింట్లు సాధించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఢిల్లీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మీరాజ్ దెబ్బకు ఢిల్లీ తొలి అర్ధభాగం ముగిసేసరికి 29-10 తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లోనూ ఢిల్లీ ఆకట్టుకుంది.

15 పాయింట్లతో చెలరేగిన మిరాజ్
ట్యాకింగ్‌లో రవీందర్ పహాల్ (5) కూడా సత్తాచాటడంతో ఢిల్లీ గెలుపు దిశగా దూసుకుపోయింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్ పుంజుకొని ఢిల్లీ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది కానీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. మరో ఆరు నిమిషాలు ఆట మిగిలి ఉందనగా ఆ జట్టు 27-39తో ఆధిక్యాన్ని తగ్గించింది.

20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసిన దీపక్ హుడా
అయితే, ఆ తర్వాత ఢిల్లీ ఆటగాళ్లు తెలివిగా ఆడుతూ చివరివరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. తమిళ్ తలైవాస్, పట్నా పైరేట్స్ మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్ 35-35తో టైగా ముగిసింది. పట్నా తరపున పర్దీప్ (11), తలైవాస్ జట్టులో అజయ్ (16) రైడింగ్‌లో సత్తాచాటారు.

పట్నా-తలైవాస్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా
మొదటి నుంచి రెండు జట్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. విరామానికి 16-12తో పట్నా ఆధిక్యంలో ఉన్నప్పటికీ విరామం తర్వాత పుంజుకున్న తలైవాస్ స్కోర్లు సమం చేస్తూ వెళ్లింది. చివరకు మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. శనివారం జరిగే మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడనుంది.

ప్రొ కబడ్డీలో శనివారం
దబంగ్ ఢిల్లీ × యు ముంబా (రాత్రి 8 నుంచి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications