న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రో కబడ్డీ: బుల్స్‌కు షాకిచ్చిన వారియర్స్, జైపూర్‌-పుణె మ్యాచ్‌ టై

PKL 2018: Bengal Warriors beat Bengaluru Bulls, Jaipur Pink Panthers, Puneri Paltan play out thrilling tie

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జైపూర్‌ పింక్‌ ఫాంథర్స్‌, పుణెరి పల్టన్‌ మధ్య తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ 30-30తో టైగా ముగిసింది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో జైపుర్ పింక్ ఫాంథర్స్ పూర్తి ఆధిపత్యం చలాయించినప్పటికీ, రెండో అర్ధభాగంలో పుణెరి పల్టన్ గొప్పగా పుంజుకుని మ్యాచ్‌ను టైగా ముగించింది.

వర్షంతో రద్దైన రెండో టీ20: అరుదైన ఘనతను కోల్పోయిన రాష్ట్రపతి వర్షంతో రద్దైన రెండో టీ20: అరుదైన ఘనతను కోల్పోయిన రాష్ట్రపతి

తొలి అర్ధభాగంలో జైపూర్‌ 17-10తో పైచేయి సాధించగా, రెండో అర్ధభాగంలో పుణెరి పల్టన్ పుంజుకుని 19-20తో ప్రత్యర్థికి చేరువగా వచ్చింది. ఆ తర్వాత ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు వరుసపెట్టి పాయింట్లు సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

జైపూర్‌ జట్టులో రైడర్‌ దీపక్‌ హుడా (11), డిఫెండర్‌ అమిత్‌కుమార్‌ (4) రాణించగా... పుణెరి పల్టన్ జట్టులో దీపక్‌ కుమార్‌ 5 రైడ్‌ పాయింట్లు, గిరీష్‌ మారుతి 6 ట్యాకిల్‌ పాయింట్లతో జట్టు ఓటమి నుంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించారు.

హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు బుల్స్‌కు బెంగాల్‌ వారియర్స్‌ జట్టు షాకిచ్చింది. 33-31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. రైడర్‌ మణీందర్‌ సింగ్‌ 14 పాయింట్లతో బెంగాల్‌ను గెలిపించాడు. బెంగళూరు జట్టులో పవన్‌ సెహ్రావత్‌ 10 పాయింట్లు సాధించాడు.

Story first published: Saturday, November 24, 2018, 10:49 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X