Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోర్టులో ఆ మెరుపులు ఇక కనిపించవు: కబడ్డీకి అనూప్ వీడ్కోలు

PKL 2018: Asian Games, World Cup winning India captain Anup Kumar retires from Kabaddi

హైదరాబాద్: లెజెండరీ కబడ్డీ ప్లేయర్, భారత్‌లో కబడ్డీకి ఆదరణ పెంచడంలో కీలక పాత్ర పోషించిన భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ అనూప్‌ కుమార్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ తరుపున ఆడుతున్న అనూప్ కుమార్ బుధవారం ఆటకు వీడ్కోలు పలికాడు.

2016 కబడ్డీ ప్రపంచకప్‌, 2010 ఆసియా క్రీడల్లో కెప్టెన్‌గా భారత్‌ను విజేతగా నిలిపిన అనూప్‌ కుమార్‌ మెరుపులు ఇక కబడ్డీ కోర్టులో అభిమానులకు కనిపించవు. దేశానికి కబడ్డీ వరల్డ్‌కప్ అందించాలన్న తన చిరకాల స్వప్నాన్ని రెండేళ్ల కిందట నెరవేర్చుకున్నానని ఈ సందర్భంగా 35 ఏళ్ల అనూప్‌ చెప్పాడు.

రిటైర్మెంట్‌ రోజు జీవితాంతం గుర్తుండుపోవాలనే

రిటైర్మెంట్‌ రోజు జీవితాంతం గుర్తుండుపోవాలనే ఉద్దేశంతో తన కుమారుడి 10వ పుట్టినరోజున తాను ఈ నిర్ణయాన్ని ప్రకటించానని అనూప్ తెలిపాడు. ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ "ఏదో సరదా కోసం చిన్నతనంలో కబడ్డీ ఆడడం మొదలెట్టా. కానీ నా జీవితంలో అదే ప్రధానమైంది. ప్రొఫెషనల్‌గా కబడ్డీ ఆడడం మొదలెట్టినపుడు భారత్‌ తరపున ఆడి స్వర్ణం సాధించాలని కలకన్నా. ఆ కలను నిజం చేసుకున్నా" అని అన్నాడు.

ప్రొ కబడ్డీలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా

"ఇక, ప్రొ కబడ్డీలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా. ఈ రోజు నా కొడుకు 10వ జన్మదినం. అందుకే, ఆటకు వీడ్కోలు పలికి ఈ రోజును మరింత మధురంగా మలుచుకున్నా. నేను కబడ్డీ ఆడడం ప్రారంభించినప్పటి పరిస్థితులకు నేటి స్థితిగతులకు అసలు పొంతనే లేదు. దేశంలో కబడ్డీకి క్రేజ్‌ పెరిగిందని, ఆటకు వాణిజ్య హంగులు కూడా తోడయ్యాయి" అని అనూప్‌ తెలిపాడు.

మంచి భవిష్యత్‌ ఉంటుంది

మంచి భవిష్యత్‌ ఉంటుంది

ప్రొ కబడ్డీ లీగ్‌ వంటి వేదికలను యువ ఆటగాళ్లు ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్‌ ఉంటుందని సూచించాడు. ఇక, అనూప్‌ కెప్టెన్సీలోనే రెండేళ్ల కిందట కబడ్డీ వరల్డ్ కప్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. 2010, 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన భారత జట్టులో అనూప్‌ సభ్యుడిగా ఉన్నాడు. ప్రొ కబడ్డీ లీగ్‌ 2వ సీజన్లో అనూప్‌ నాయకత్వంలో యు ముంబా టైటిల్‌ విజేతగా నిలిచింది.

Story first published: Thursday, December 20, 2018, 9:30 [IST]
Other articles published on Dec 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+