ఆల్‌రౌండ్ షో: హర్యానాపై పుణెరి అద్భుత విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో పుణెరి పల్టన్ భారీ విజయం సాధించింది. మంగళవారం హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణేరి ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. దీంతో హర్యానాను 37-25 తేడాతో పుణెరి ఓడించింది. మ్యాచ్ సాంతం పుణె ఆధిపత్యం చలాయించింది.

హర్యానా విజయంలో రాజేశ్ మొండల్ కీలకపాత్ర
ఆ జట్టు రైడర్ రాజేశ్ మొండల్ 7 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకుని విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పుణెరి రైడర్లు 15 పాయింట్లు సాధించగా డిఫెండర్లు 17 పాయింట్లు సాధించారు. హర్యానా రైడర్ సుర్జీత్ సింగ్ అత్యధికంగా 10 రైడింగ్ పాయింట్లు సాధించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

ఆరంభం నుంచే హోరాహోరీగా
మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీ తలపడ్డాయి. ఒకానొక దశలో ఇరు జట్లు 4-4, 7-7 సమానంగా నిలిచాయి. తొలి అర్ధభాగం ముగిసేవరకు హర్యానా 8-9తో గట్టి పోటీనే ఇచ్చింది. అయితే చివర్లో పుంజుకున్న పుణెరి 16-10తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో హర్యానాకు ధీటుగా పాయింట్లు సాధించింది.

17వ నిమిషంలో పుణెరి ఆధిక్యంలోకి
దీపక్ హుడా పాయింట్ తేవడంతో 17వ నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లిన పుణెరి.. అదే జోరు చివరిదాకా కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్‌లో పుణెరి 17 పాయింట్లు రాబట్టగా హర్యానా 9 పాయింట్లు మాత్రమే చేసింది. హర్యానా రెండు సార్లు ఆలౌటై ఓటమి పాలైంది.

జోన్-బి
జోన్-బి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-32తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. రైడింగ్‌లో ప్రదీప్ నర్వాల్ (11), డిఫెండింగ్‌లో జైదీప్ (3) రాణించి పట్నా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. బెంగళూరు ఒక దశలో 15-30తో వెనకబడిన ఆ జట్టు.. వరుస పాయింట్లతో 36-30తో పట్నాను సమీపించింది. అయితే చివరి నిమిషాల్లో పాయింట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డ పట్నా విజయం సాధించింది.

ప్రొ కబడ్డీలో బుధవారం
యు ముంబా Vs గుజరాత్ ఫార్చున్‌జెయింట్స్ (రాత్రి 8 గంటలకు)
పట్నా పైరేట్స్ Vs తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటలకు)
స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications