Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తృటిలో సంచలన విజయాన్ని మిస్ చేసుకున్న తలైవాస్

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఐదో సీజన్‌లోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసే అవకాశాన్ని తమిళ్ తలైవాస్ తృటిలో చేజార్చుకుంది. బుధవారం జరిగిన జోన్‌-బి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్‌ చేతిలో 41-39తో తమిళ్ తలైవాస్ ఓటమి పాలైంది.

అయితే చివరి రైడ్‌లో మోను గోయత్‌ విజయవంతం కావడంతో పైరేట్స్‌ 41-39తో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పాట్నా రైడర్‌ మోను గోయత్‌ అత్యధికంగా 12 పాయింట్లు సాధించాడు. ఇక, పాట్నా కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ 9, విజయ్‌ 5 పాయింట్లు సాధించారు.

టాప్‌ స్కోరర్‌గా అజయ్‌ ఠాకూర్‌

టాప్‌ స్కోరర్‌గా అజయ్‌ ఠాకూర్‌

ఇక, తమిళ్ తలైవాస్ తరుపున కెప్టెన్ అజయ్‌ ఠాకూర్‌ (12) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ప్రపంజ న్‌ (8) పాయింట్లతో రాణించాడు. అంతకు ముందు జరిగిన జోన్‌-ఎ మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ 45-23తో యు ముంబాపై విజయం సాధించింది.

రైడింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ ఫార్చున్ జెయింట్స్

రైడింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ ఫార్చున్ జెయింట్స్

రైడింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆద్యంతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 24-12తో ఆధిక్యంలో నిలిచిన ఆ జట్టు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది.

డిఫెన్స్‌లో తడబడ్డ యు ముంబా

డిఫెన్స్‌లో తడబడ్డ యు ముంబా

గుజరాత్ తరఫున రైడింగ్‌లో రంజిత్ చంద్రన్ 11 పాయింట్లతో రాణించగా, ఫజెల్ 6 పాయింట్లతో సూపర్ ట్యాకిల్‌తో చెలరేగాడు. ఇక యు ముంబా ఆటగాళ్లలో కెప్టెన్ అనూప్ 7 రైడింగ్ పాయింట్లు సాధించగా, శ్రీకాంత్ 5తో ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌లో తడబడ్డ యు ముంబా గుజరాత్ ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయింది.

ప్రో కబడ్డీలో గురువారం

ప్రో కబడ్డీలో గురువారం

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ Vs హర్యానా స్టీలర్స్‌ (రాత్రి 8 గంటలకు)

యూపీ యోధా Vs పట్నా పైరేట్స్‌ (రాత్రి 9 గంటలకు)

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+