Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ క్వాలిఫయర్‌-2 హైలెట్స్: వరుసగా మూడోసారి ఫైనల్‌కు పట్నా

హైదరాబాద్: డిఫెండింగ్‌ ఛాంపియన్ పట్నా పైరేట్స్‌ వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో భాగంగా గురువారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో పట్నా 47-44తో బెంగాల్‌ వారియర్స్‌ను అలవోకగా ఓడించింది. శనివారం జరిగే ఫైనల్ పోరులో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌తో పట్నా తలపడనుంది.

లీగ్‌ మ్యాచ్‌ల్లో బెంగాల్‌పై గెలవలేకపోయిన పట్నా కీలక క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్ పర్దీప్‌ నర్వాల్‌ 23 పాయుంట్లతో అద్బుత ప్రదర్శన చేయగా, డిఫెన్స్‌లో విశాల్‌ మానే రాణించాడు. చివర్లో బెంగాల్ ఆటగాడు మణిందర్‌ సింగ్‌ (17) వరుస పాయింట్లు సత్తా చాటినా జట్టును గెలిపించలేక పోయాడు.

 చూస్తుండగానే 46-43తో బెంగాల్‌ రేసులోకి

చూస్తుండగానే 46-43తో బెంగాల్‌ రేసులోకి

మ్యాచ్‌ ముగిసేందుకు ఇంకా ఐదు నిమిషాలే మిగిలున్న దశలో పట్నా 41-27తో విజయానికి సిద్ధమైన వేళ బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లు అనూహ్యంగా పోరాడారు. ఇటు రైడింగ్‌లో... అటు టాకిల్‌లో వరుసబెట్టి పాయింట్లు సాధించారు. చూస్తుండగానే 46-43తో బెంగాల్‌ రేసులోకి వచ్చింది. ఇక 60 సెకన్ల ఆటే మిగిలింది.

చివరి క్షణాల్లో తీవ్ర ఉత్కంఠ

చివరి క్షణాల్లో తీవ్ర ఉత్కంఠ

దీంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఈ సమయంలో కెప్టెన్ పర్దీప్ నర్వాల్ తెలివైన గేమ్‌ ప్లాన్‌తో ప్రత్యర్థి రైడర్‌కు ఒకరినే సమర్పించుకుంది. తద్వారా ఒక పాయింట్‌నే కోల్పోయింది. చివరిలో పర్దీప్ రైడింగ్‌కు వెళ్లి టైమ్‌పాస్‌ చేసి ఓ పాయింట్‌ తెచ్చాడు. దీంతో మ్యాచ్‌ ముగిసింది. పట్నా ఫైరేట్స్ పైనల్‌కు చేరింది.

23 పాయింట్లు సాధించిన పర్దీప్

23 పాయింట్లు సాధించిన పర్దీప్

ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ కెప్టెన్ పర్దీప్ 23 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లు కూడా రాణించడం పట్నాకు కలిసొచ్చింది. మ్యాచ్‌లో 28 రెయిడ్‌ పాయింట్లు సాధించిన పట్నా.. 10 ట్యాకిల్‌ పాయింట్లు రాబట్టింది. విజయ్, మోనూ గోయట్‌ చెరో 4 పాయింట్లు చేశారు. పట్నా కెప్టెన్ పర్దీప్ ఈ సీజన్‌లో 18వసారి సూపర్‌-10 సాధించాడు.

600 పాయింట్లు సాధించిన రెండో ఆటగాడు

600 పాయింట్లు సాధించిన రెండో ఆటగాడు

మొత్తానికి ఈ సీజన్‌లో 350 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక, ప్రో కబడ్డీ ఐదు సీజన్లను కలుపుకుని 600 పాయింట్లు సాధించిన రెండో ఆటగాడు పర్దీప్ నర్వాల్ నిలిచాడు. ఇతని కంటే ముందు రాహుల్‌ చౌదరి ఉన్నాడు. తాజా విజయంతో ప్రొ కబడ్డీలో మూడుసార్లు ఫైనల్‌ చేరిన రెండో జట్టుగా పట్నా నిలిచింది. గత రెండు లీగ్‌ల్లో టైటిల్ విజేత పట్నానే.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+