ప్రో కబడ్డీ: ఐదో సీజన్‌లో నాలుగో సారి 'టై'

Posted By:

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో హర్యానా స్టీలెర్స్ నాలుగోసారి తమ మ్యాచ్‌ను 'టై' గా ముగించింది. గురువారం జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగి సమానంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరకు 27-27 పాయింట్లతో డ్రాగా ముగిసింది.

తొలి అర్ధభాగంలో 17-9తో ఆధిక్యంలో నిలిచిన హర్యానా

తొలి అర్ధభాగంలో 17-9తో ఆధిక్యంలో నిలిచిన హర్యానా

హర్యానా స్టీలర్స్ మొత్తంగా 16 రైడ్‌ పాయింట్లు సాధించగా, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 19 రైడ్‌ పాయింట్లు రాబట్టింది. హర్యానా ఆటగాళ్లు దీపక్‌ కుమార్‌ దహియా (7), వికాస్‌ (4) అద్భుత ప్రదర్శన చేశారు. తొలి అర్ధభాగంలో హర్యానా జట్టు 17-9తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో కూడా అదే జోరుని కొనసాగించింది.

హర్యానా స్కోరుని సమం చేసిన జైపూర్

హర్యానా స్కోరుని సమం చేసిన జైపూర్

మ్యాచ్‌ మరో 5 నిమిషాల్లో ముగుస్తుందనగా హర్యానా 24-19తో విజయం సాధించేలా కనిపించింది. అయితే నితిన్‌ రావల్‌ (11) వరుసగా రైడ్ పాయింట్లతో చెలరేగడంతో జైపూర్‌ ఒకానొక దశలో హర్యానా స్కోరుని సమం చేసి, మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా జైపూర్‌ 27-26తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇరు జట్లు చెరో రెండు సార్లు ఆలౌట్

ఇరు జట్లు చెరో రెండు సార్లు ఆలౌట్

చివర్లో సుర్జీత్‌ ఒక రైడ్ పాయింట్ సాధించడంతో హర్యానా మ్యాచ్‌ని టైగా ముగించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో రెండు సార్లు ఆలౌటయ్యాయి. హర్యానా జట్టులో దీపక్ కుమార్ దహియా 7, వికాస్ 4 రైడింగ్ పాయింట్లు సాధించారు. జైపూర్ జట్టులో నితిన్ రావల్ 12 పాయింట్లు సాధించగా.. జస్వీర్ సింగ్ 2, పవన్ కుమార్ 4 రైడింగ్ పాయింట్లతో నిలిచారు.

ప్రొ కబడ్డీలో శుక్రవారం

ప్రొ కబడ్డీలో శుక్రవారం

పట్నా × తెలుగు టైటాన్స్‌ రాత్రి 8 గంటల నుంచి
యు ముంబా × గుజరాత్‌ రాత్రి 9 గంటల నుంచి
స్టార్స్‌ స్పోర్ట్స్‌-2లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Friday, September 15, 2017, 12:16 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి