ప్రో కబడ్డీ: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హర్యానా
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో హర్యానా స్టీలెర్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన జోన్-ఎ మ్యాచ్‌లో హర్యానా స్టీలెర్స్ 30-26తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. జోన్-ఎలో రెండో స్థానంలో ఉన్న హర్యానాకు మూడు మ్యాచ్‌ల తర్వాత ఇది తొలి విజయం కావడం విశేషం.

హోరాహోరీగా సాగిన మ్యాచ్
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి రెండు జట్లు 13-13తో సమానంగా నిలిచాయి. అయితే రెండో అర్ధభాగంలో హర్యానా రైడర్లు దూకుడు ప్రదర్శించడంతో 24-16తో ఆధిక్యం సాధించింది. చివరి వరకు అదే దూకడుని ప్రదర్శించి మ్యాచ్‌పై పట్టు కొనసాగించింది.

డిఫెన్స్‌లో విఫలమైన జైపూర్
హర్యానా జట్టు తరఫున వజీర్ సింగ్ రైడింగ్‌లో 10 పాయింట్లు సాధించగా, సురేందర్ నాడ ట్యాకిల్‌లో ఐదు పాయింట్లు గెలిచాడు. డిఫెన్స్‌లో విఫలమైన జైపూర్ రైడింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. జైపూర్‌లో తుషార్ పాటిల్ (8), పవన్‌కుమార్ (7) సత్తా చాటినా జట్టుకు పరాజయం తప్పలేదు.

మరో మ్యాచ్‌లో పాట్నాను ఓడించిన యూపీ యోధా
తాజా విజయంతో 17 మ్యాచ్‌ల ద్వారా 54 పాయింట్లతో స్టీలర్స్ జోన్-ఎలో టాప్‌లో నిలిచింది. ఇక 12 మ్యాచ్‌లతో 37 పాయింట్లు సాధించిన జైపూర్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా జట్టు 46-41తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. యూపీ ఆటగాళ్లలో నితిన్ తొమర్ 16, జీవ కుమార్ 3 పాయింట్లు సాధించారు.

రాంచీలో పైరేట్స్‌కి ఇదే తొలి పరాజయం
రాంచీలో జరుగుతున్న పోటీల్లో పైరేట్స్‌కిది తొలి పరాజయం. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో నెగ్గిన పట్నా.. ఒకదానిని డ్రా చేసుకుంది. మొత్తంగా సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌ను పైరేట్స్ పరాజయంతో ముగించింది. పట్నా జట్టులో ప్రదీప్ నర్వాల్ 22, రైడింగ్‌లో 13 పాయింట్లు తీసుకొచ్చాడు. జైదీప్ 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications