బెంగళూరు గెలిచింది: సొంతగడ్డపై తలైవాస్ ఓటమి రికార్డు
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సొంతగడ్డపై ఆడిన చివరి మ్యాచ్‌లో కూడా తమిళ్ తలైవాస్‌కు ఓటమి తప్పలేదు. గురువారం జోన్ 'బి'లో ఏకపక్షంగా సాగిన పోరులో బెంగళూరు 45-35తో ఆతిథ్య తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. దీంతో ఈ సీజన్‌లో తమిళ్ తలైవాస్ 13వ పరాజయాన్ని చవిచూసింది.

17 పాయింట్లతో రాణించిన బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్
ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ 17 పాయింట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 24 సార్లు కూతకు వెళ్లిన అతను 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు. అజయ్ కుమార్ (6), సచిన్ కుమార్ (5) కూడా రాణించారు. ఈ సీజన్‌లో 18 మ్యాచ్‌లాడిన బుల్స్‌కు ఇది ఐదో విజయం.

ఓంటరి పోరాటం చేసిన తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్
మరోవైపు తమిళ్ తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ (15) ఓంటరి పోరాటం చేసినా.. ఫలితం లేకపోయింది. రెయిడ్ పాయింట్ల పరంగా రెండు జట్లు దాదాపుగా సమానంగా నిలిచాయి. ప్రపంజన్ (8), దర్శన్ (6) రాణించినా డిఫెండర్లు తేలిపోవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు.

39 పాయింట్లతో గ్రూప్‌లో ఐదో స్థానం
మూడు ఓటముల తర్వాత విజయం సాధించిన బెంగళూరు బుల్స్ 39 పాయింట్లతో గ్రూప్‌లో ఐదో స్థానానికి ఎగబాకింది. తమిళ్ తలైవాస్ 35 పాయింట్లతో ఆరో స్థానానికి దిగజారింది. సొంతగడ్డపై జరిగిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన రెండో జట్టుగా తలైవాస్ నిలిచింది.

ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తమిళ్ తలైవాస్
19 మ్యాచ్‌ల్లో 13 ఓటములను చవిచూసిన ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా ప్రో కబడ్డీలో శుక్రవారం జైపూర్ పింక్‌పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications