Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ: బెంగాల్‌కు షాకిచ్చిన తమిళ్ తలైవాస్‌

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌కు షాక్‌ తగిలింది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి రైడ్‌లో కెప్టెన్ అజయ్‌ ఠాకూర్‌ సూపర్ రైడ్‌తో రెండు పాయింట్లు సాధించడంతో తమిళ్‌ తలైవాస్‌ అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తలైవాస్‌ 33-32తో బెంగాల్‌పై విజయం సాధించింది. చివరి ఐదు నిమిషాల్లో ఏడు రైడ్లతో ఎనిమిది పాయింట్లు సాధించిన అజయ్‌ తమిళ్ తలైవాస్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు వారియర్స్‌ రైడర్‌ మణిందర్‌ సింగ్‌ 13 పాయింట్లు తెచ్చినా జట్టుని గెలిపించలేకపోయాడు.

PKL 2017: Ajay Thakur's late burst takes Tamil Thalaivas over the line against Bengal Warriors

ఇక, అరుణ్‌ ఎనిమిది టాకిల్‌ పాయింట్లు స్కోర్‌ చేశాడు. ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో తమిళ్ తలైవాస్‌కు ఇది మూడో విజయం. 12 మ్యాచ్‌ల ద్వారా కేవలం 27 పాయింట్లే పొందిన తలైవాస్‌ అట్టడుగు స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు 18 మ్యాచ్‌ల్లో 59 పాయింట్లతో బెంగాల్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఓటమితో బెంగాల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 42-24 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీని చిత్తు చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+