PKL 2019: సొంతగడ్డపై బెంగళూరు జోరుని పట్నా అడ్డుకునేనా?

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా బుధవారం పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు అంచె మ్యాచ్‌లు జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పవన్ షెరావత్ vs పర్దీప్ నర్వాల్‌గా మారింది.
ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లకు గాను ఇప్పటివరకు బెంగళూరు బుల్స్ ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు పట్నా పైరేట్స్ జట్టు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పట్టికలో ఆఖరు స్థానంలో ఉంది.

గత మ్యాచ్‌లో విజయం
గత మ్యాచ్‌లో విజయం సాధించిన జోరుతో బెంగళూరు బుల్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా... పట్నా పైరేట్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ విజయం సాధిస్తే ఈ సీజన్‌లో సొంతగడ్డపై రెండో విజయం తన ఖాతాలో వేసుకుంటుంది. బెంగళూరు బుల్స్‌కు చెందిన పవన్ షెరావత్ 120 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సైతం అతడు చెలరేగితే విజయం ఆతిథ్య జట్టుదే.

బెంగళూరు బుల్స్
ఆడినవి: 13
గెలిచినవి: 7
టై: 0
ఓడనవి: 6
విన్ రేట్: 53.65%
బెస్ట్ రైడర్: పవన్ షెరావత్
బెస్ట్ డిఫెండర్: మహేందర్ సింగ్

పట్నాకు కలిసిరాలేదు
ప్రో కబడ్డీ తొలి సీజన్‌లో ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌కు ఈ సీజన్ మాత్రం అస్సలు కలిసిరాలేదు. జట్టులో పర్దీప్ నర్వాల్ ఒక్కడే రాణిస్తున్నప్పటికీ మిగతా వారి నుంచి అతడికి సహాకారం అందడం లేదు. ఈ సీజన్‌ను అద్భుతంగా మొదలుపెట్టిన మరో రైడర్ మహ్మద్ ఇస్మాయిల్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా జట్టు విజయాలను అందుకోలేకపోతుంది. ఇక, పట్నా డిఫెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా సమిష్టిగా రాణిస్తే పట్నా గెలుస్తుంది లేదంటే పట్టికలో ఆఖరి స్థానానికే పరిమితం అవుతుంది.

పట్నా పైరేట్స్
ఆడినవి: 11
గెలిచినవి: 3
టై: 0
ఓడనవి: 8
విన్ రేట్: 27.27%
బెస్ట్ రైడర్: పర్దీప్ నర్వాల్
బెస్ట్ డిఫెండర్: జైదీప్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications