Pro Kabaddi: మరో మ్యాచ్ టై.. బెంగళూరుకు పాట్నా పంచ్

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ 2022 హోరాహోరిగా సాగుతుంది. జట్లన్నీ నువ్వా, నేనా అన్నట్లు తలపడుతుండడంతో ఫలితం కోసం చివరి వరకు ఉత్కంఠ తప్పడం లేదు. చివరికి కొన్ని మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే టైగా ముగుస్తున్నాయి.

మరో మ్యాచ్ టై
తాజాగా తమిళ్‌తలైవస్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు జట్లు విజయాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో చివరకు ఫలితం తేలకుండానే 31-31తో మ్యాచ్ టైగా ముగిసింది. మరోవైపు ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లు టైగానే ముగిశాయి.
జైపూర్ జట్టులో అర్జున్ దేశ్వాల్, నవీన్ ఆరేసి పాయింట్లతో పర్వాలేదనిపించారు. సందీప్ 5, దీపక్ 3 పాయింట్లు సాధించారు. ఇక తమిళ్ తలైవస్ జట్టులో మంజీత్ 9 పాయింట్లతో సత్తా చాటాడు. సుర్జీత్ సింగ్ 5, సాగర్ 4 పాయింట్లు సాధించారు. సాహిల్ సింగ్, అజింక్యా పవార్ మూడేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. భవాని రాజ్‌పుత్ 2 పాయింట్లు సాధించాడు.

పాట్నా విక్టరీ
ఇక మరో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్‌పై పాట్నా పైరేట్స్ 31-38 తేడాతో విజయం సాధించింది. పాట్నా జట్టులో సునీల్ 9, సచిన్ 8 పాయింట్లతో సత్తా చాటారు. గుమన్ సింగ్ 7 పాయింట్లు సాధించగా.. షాడ్లూయి, నీరజ్ కుమార్ మూడేసి పాయింట్లను ఖాతాలో వేసుకున్నారు. ప్రశాంత్ కుమార్ రాజ్ 2 పాయింట్లు సాధించాడు. ఇక బెంగళూరు బుల్స్ జట్టులో పవన్ కుమార్ సూపర్ 10తో సత్తా చాటాడు. మహేందర్ సింగ్, నందల్ ఆరేసి పాయింట్లు సాధించారు. చంద్రన్ రంజిత్, దీపక్ నర్వాల్ మూడేసి పాయింట్లను ఖాతాలో వేసుకున్నారు.

పాయింట్ల పట్టిక
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు బుల్స్ అగ్ర స్థానంలో, పాట్నా పైరేట్స్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఏడేసి విజయాలు చొప్పున సాధించిన ఈ రెండు జట్ల ఖాతాలో 39 పాయింట్ల చొప్పున ఉన్నాయి. ఇక 6 విజయాలతో మూడో స్థానంలో దబాంగ్ ఢిల్లీ, 5 విజయాలతో నాలుగో స్థానంలో జైపూర్ పింక్ పాంథర్స్ ఉంది. కాగా ఇప్పటివరకు ఒక్క పాయింట్ కూడా సాధించని తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది.

నేటి మ్యాచ్‌లు
పుణేరి పల్టాన్ VS యూపీ యోధా- రాత్రి 7:30 గంటలకు
తెలుగు టైటాన్స్ VS బెంగాల్ వారియర్స్- రాత్రి 8:30 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications