హైదరాబాద్‌లో తొలి కూత: చెన్నైలో ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్
హైదరాబాద్: గత నాలుగు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్ హైదరాబాద్‌లో ఆరంభంకానుంది. వచ్చే నెల 28 నుంచి అక్టోబర్ 28 వరకూ జరిగే ఈ మెగా లీగ్ షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. జులై 28న హైదరాబాద్‌లో జరిగే తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ జట్టు మధ్య మ్యాచ్‌తో ప్రొకబడ్డీ మొదలవనుంది.
మొత్తం 12 జట్లు తలపడుతున్న ఈ సీజన్‌ను ఆయా 12 ఫ్రాంచైజీల వేదికల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 13 వారాల పాటు 138 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబరు 28న చెన్నైలో ఫైనల్ నిర్వహిస్తారు. ఈసారి కొత్తగా మరో 4 జట్లతో కలిపి మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. మొత్తం 12 జట్లను రెండు జోన్లు ఏ, బీలుగా విభజించారు.

జట్టు 15 మ్యాచ్‌లు
తొలుత ప్రతి జట్టు 15 మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం 7 అంతర్ జోనల్ మ్యాచ్‌ల్లో తలపడుతుంది. రెండుగ్రూపుల నుంచి తొలిమూడు స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ రేసుకు అర్హత సాధిస్తాయి .ఫైనల్‌కు ముందు 3 క్వాలిఫయర్స్, 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ముంబై, చెన్నై నగరాల్లో జరుగుతాయి. ఫైనల్‌కు ముంబై ఆతిథ్యం ఇస్తుంది.

కొత్తగా నాలుగు జట్లు
నాలుగు కొత్త జట్లతో ముందుకొస్తున్న లీగ్ ఫార్మాట్‌ను కొత్తగా తీర్చిదిద్దారు. ఒక్కో జట్టు తమ జోన్‌లో 15 మ్యాచ్‌లు.. అవతలి జోన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు జోన్‌ల్లో టాప్-3లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్లేఆఫ్ దశలో ఐపీఎల్ మాదిరిగా మూడు క్వాలిఫయర్స్, రెండు ఎలిమినేటర్స్ మ్యాచ్‌లను ప్రవేశపెట్టారు.

క్వాలిఫయర్-3 విజేత నేరుగా ఫైనల్‌కు
క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌ల్లో నెగ్గిన జట్లు ఎలిమినేటర్-1లో పోటీ పడతాయి. క్వాలిఫయర్-3 విజేత నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఆ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్-1 విజేతతో ఎలిమినేటర్-2 మ్యాచ్‌లో తలపడుతుంది. నెగ్గిన జట్టు తుదిపోరుకు చేరుకుంది.

రెండు జోన్లుగా ఆరు జట్లు
జోన్-1: దబాంగ్ ఢిల్లీ, జైపూర్, పుణెరి పల్టన్, యు ముంబా, హర్యానా స్టీలర్స్, గుజరాత్
జోన్-2: తెలుగు టైటాన్స్, బెంగళూరు, పట్నా పైరేట్స్, బెంగాల్ వారియన్స్, యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications