లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తనను వేధించారని ఫిర్యాదు చేసిన ఓ జాతీయ స్ధాయి క్రీడాకారిణిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ఇంటిని, దుకాణాన్ని ధ్వంసం చేశారు.
ఈ దాడిపై కబడ్డీ క్రీడాకారిణి డాలీ సింగ్ ముఖంపై బలమైన దెబ్బలు తగిలాయి. అంతకు ముందు వారిపై ఫిర్యాదు చేసిందన్న కారణంతోనే డాలీ సింగ్‌పై వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈ నెల 15న తనను లైంగికంగా వేధించారని ఉజాల ఠాకూర్, రిషీ గాంధీలపై కాన్పూర్‌కు చెందిన డాలీ సింగ్ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ సంఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంగతి తెలుసుకున్న ఉజాల, రిషి మద్దతుదారులు 12 మంది దుండగులు ముఖాలు కనిపించకుండా ముసుగులు ధరించి విచక్షణ రహితంగా దాడి చేశారు.
దాడి సమయంలో తన కుమార్తె, భార్య మాత్రమే ఇంటిలో ఉన్నారని సింగ్ తండ్రి అశుతోష్ సింగ్ తెలిపాడు. ఈ ఘటనపై డాలీ సింగ్ తండ్రి మండిపడ్డారు. కేసు నమోదు చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే, వారు తమను ఊరడించేందుకు ప్రయత్నించారే తప్ప చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై సమాజ్ వాదీ పార్టీ గౌరవ్ భాటియా మాట్లాడుతూ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, నిందుతులను త్వరోలనే అరెస్ట్ చేస్తారని చెప్పారు.
<center><iframe width="100%" height="401" src="https://www.youtube.com/embed/zB7dJeeS-_g" frameborder="0" allowfullscreen></iframe></center>