ప్రో కబడ్డీ చరిత్రలోనే ఇది తొలిసారి: భారీ వర్షంతో మ్యాచ్‌లు రద్దు
హైదరాబాద్: ముంబై మంగళవారం ఉదయం నుంచీ కురుస్తున్న భారీ వర్షాలు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లనూ వదల్లేదు. భారీ వర్షాలు ముంబైని ముంచెత్తడంతో నగరం లో మంగళవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో మ్యాచ్ కోసం ప్లేయర్స్ స్టేడియానికి చేరుకోలేకపోయారు.
రాత్రి 8 గంటలకు మ్యాచ్ అయినప్పటికీ, ప్లేయర్స్ మధ్యాహ్నం 3.30 గంటలకే హోటల్ నుంచి బయలుదేరారు. అయినా ఎక్కడ చూసినా భారీగా నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో ప్లేయర్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. నాలుగు గంటలైనా వాళ్లు స్టేడియానికి చాలా దూరంలోనే ఉండిపోయారు.

దీంతో మంగళవారం మ్యాచ్‌లు ఆడలేకపోతున్నామని ప్లేయర్స్ అభిమానులకు వీడియో సందేశాలు పంపించారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మొదటి మ్యాచ్‌లో బెంగళూరు, యూపీ యోధా.. రెండో మ్యాచ్‌లో ముంబై, గుజరాత్ టీమ్స్ తలపడాల్సి ఉన్నా.. ఆ రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
అయితే, ఈ మ్యాచ్‌లను తిరిగి నిర్వహిస్తామని ప్రో కబడ్డీ నిర్వహకులు తెలిపారు. అయితే, ఏ రోజు నిర్వహిస్తారో ప్రకటిం చాల్సి ఉంటుంది. కాగా, ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలోనే భారీ వర్షాల కారణంగా మ్యాచ్‌లు రద్దుకావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications