చెలరేగిన భారత్: విజయం, ప్రత్యర్ధి 4సార్లు ఆలౌట్
అహ్మదాబాద్: ప్రపంచ కబడ్డీ కప్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం చవిచూసిన జట్టు రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 57-20 తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో వరుస విజయం. తొలి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఓటమిపాలైంది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత తరుపున అజయ్ ఠాకూర్ అత్యధికంగా పదకొండు పాయింట్లుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీవ్ నర్వాల్ ఎనిమిది పాయింట్లు సాధించాడు.

సెమీఫైనల్‌లోకి చేరే అశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిఫెన్స్‌లో భారత్‌కు తిరుగులేదని మరోసారి ఈ మ్యాచ్‌లో నిరూపించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ మొత్తం తన ప్రత్యర్ధి జట్టు బంగ్లాదేశ్‌ను నాలుగు సార్లు ఆలౌట్ చేసింది.
అందరికీ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో భారత జట్టు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లకు కూడా ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లలో జపాన్ 33-22 తేడాతో పోలాండ్‌పై, ఆస్ట్రేలియా 68-45 తేడాతో అర్జెంటీనాపై గెలిచాయి. ఈనెల 15న జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications