హైదరాబాద్: అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కబడ్డీ టోర్నమెంట్‌లో మంగళవారం చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఆతిథ్య దేశమైన భారత్ మంగళవారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. గ్రూప్ ఏలో ఇప్పటికే దక్షిణ కొరియా సెమీ ఫైనల్‌కు చేరుకోగా, రెండో స్థానం కోసం ఇండియా ముందంజలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండివరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 16 పాయింట్లు సాధించిన భారత జట్టు మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు భారత్ ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన సెమీస్ కు చేరుకోవడం విశేషం.
గ్రూప్ ఏలో భారత్‌కు పోటీగా బంగ్లాదేశ్ 11 పాయింట్లు, ఇంగ్లాండ్ 10 పాయింట్లతో సెమీ ఫైనల్స్ బరిలో ఉన్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై 80-8తో నెగ్గి, బోనస్ పాయింట్‌ను కూడా సాధించింది. దీంతో అనూహ్యంగా బంగ్లాదేశ్ సెమీస్ రేసులో నిలిచింది.

దీంతో ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్‌లో భారత్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడి, తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. అర్జెంటీనాపై బోనస్ విజయం సాధిస్తే ఆ జట్టే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా బంగ్లాదేశ్ తన చివరి మ్యాచ్‌లో ఓటమిపాలై, భారత్‌పై ఇంగ్లాండ్ బోనస్ పాయింట్‌తో గెలిస్తే ఇంగ్లాడ్ సెమీస్‌కు చేరుతుంది.
భారత్ సాధారణంగా ఓటమిపాలై, బంగ్లాదేశ్ కూడా అర్జెంటీనాతో ఓడిపోతే భారత్ సెమీస్‌కు వెళ్లడం ఖాయం. ఇవేమి అవసరం లేకుండా ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్స్‌కు వెళుతుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది.