అహ్మాదాబాద్: అహ్మదాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ వరల్డ్ కప్ టోర్నీలో పోలాండ్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 75-29తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. పాయింట్ల పరంగా ఈ ఏడాది ప్రపంచ కప్‌లో జరిగిన అత్యుత్తమ మ్యాచ్ ఇదే కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆటలో భాగంగా ఆది నుంచే పోలాండ్ ఆటగాళ్లు అమెరికాపై అధిపత్యం చూపించారు. ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచ కబడ్డీ కప్‌లోకి అడుగుపెట్టిన అమెరికా అనుభవలేమిని పోలాండ్ తమకు అనుకూలంగా మలచుకుని రెచ్చిపోయారు. రైడింగ్‌కు వచ్చిన ప్రతి అమెరికా రైడర్‌ను తమ అద్భుతమైన డిఫెన్స్‌తో పోలాండ్ ఆటగాళ్లు కట్టడి చేశారు.

అంతేకాదు ఆట ద్వితీయార్ధంలో మరింత రెచ్చిపోయిన పోలాండ్ పలుమార్లు ప్రత్యర్థి ఆమెరికాను ఆలౌట్ చేస్తూ ఏకపక్ష విజయాన్ని సాధించింది. కాగా, గ్రూప్-ఎ మ్యాచ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 68-28తో అర్జెంటీనాను చిత్తు చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌కు రెండో విజయం.
ఓటమితో టోర్నీని ఆరంభించిన ఇంగ్లాండ్ వరుసగా మూడో విజయం సాధించగా, అర్జెంటీనా హాట్రిక్ ఓటమి నమోదు చేసింది. ఇంగ్లాండ్ రైడర్ టోప్ అదెవాలుర్ 19 పాయింట్లతో సత్తా చాటాడు. సోమేశ్వర్ కలియా 13, కేశవ్ గుప్తా 10 పాయింట్లు సాధించారు. కాగా భారత్ శనివారం అర్జెంటీనాతో తలపడనుంది.