హైదరాబాద్: దుబాయి వేదికగా ఆరు దేశాల మధ్య తొలిసారి నిర్వహిస్తున్న 'కబడ్డీ మాస్టర్స్' టోర్నమెంట్‌కు గురువారం తెరలేవనుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 9 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో ఆరు జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి.
ఈ టోర్నీలో భారత్ పేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, ఇరాన్, కొరియా లాంటి జట్లు పోటీ పడుతుండడంతో ఇండోనేషియా వేదికగా ఆగస్టులో ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్‌కు ముందు ఈ టోర్నీని సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్ అనుకుంటుంది.
ఈ సందర్భంగా భారత కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ''ఆసియా క్రీడల్లో ఇరాన్, పాకిస్థాన్, కొరియా జట్లు కూడా పాల్గొంటాయి. కాబట్టి ఈ టోర్నీ సెమీస్ లాంటింది. ఆసియా క్రీడలకు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది'' అని తెలిపాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్, కెన్యాలతో కలిసి భారత్ గ్రూప్- ఎలో ఉంది.
గ్రూప్- బిలో ఇరాన్, కొరియా, అర్జెంటీనా జట్లు ఉన్నాయి. తొలుత రౌండ్ రాబిన్లో గ్రూప్ ఒక జట్టు మిగత రెండు ప్రత్యర్థులతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్, రోహిత్ కుమార్, రిషాంక్ దేవడిగ, మోను గోయత్, దీపక్ హుడా, మంజీత్ చిల్లర్, సురేందర్ నాడా, గిరీష్ ఎర్నాక లాంటి ఆటగాళ్లతో భారత జట్టు బలంగా ఉంది. తొలి రోజు రెండో మ్యాచ్‌లో ఇరాన్-కొరియా తలపడుతాయి.
పూర్తి షెడ్యూల్:
June 22, 2018
India vs Pakistan - 8 pm IST
Iran vs South Korea - 9 pm IST
June 23, 2018
Iran vs Argentina - 8 pm IST
India vs Kenya - 9 pm IST
June 24, 2018
South Korea vs Argentina - 8 pm IST
Pakistan vs Kenya - 9 pm IST
June 25, 2018
Iran vs South Korea - 8 pm IST
India vs Pakistan - 9 pm IST
June 26, 2018
Iran vs Argentina - 8 pm IST
India vs Kenya - 9 pm IST
June 27, 2018
South Korea vs Argentina - 8 pm IST
Pakistan vs Kenya - 9 pm IST
June 29, 2018 - Semi-finals
SF1: A1 vs B2 - 8 pm IST
SF2: B1 vs A2 - 9 pm IST
June 30, 2018 - Final
Winner of SF1 vs Winner of SF2 - 8 pm IST
స్టార్ ఇండియాతో కలిసి అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) ఈ టోర్నీని నిర్వహిస్తోంది.
రాత్రి 8 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, 2లో ప్రత్యక్ష ప్రసారం