న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీటూ ఉద్యమం: 59ఏళ్ల కబడ్డీ కోచ్ ఆత్మహత్య

Kabaddi coach accused of molestation commits suicide

న్యూ ఢిల్లీ: ఇప్పటికే పలువురు సినీ, పత్రికా రంగ ప్రముఖులు 'మీటూ'ఉద్యమం పేరిట భారీగానే తమ మనోవేదనను బయటపెట్టారు. రంగాల వారీగా మహిళల పట్ల జరుగుతున్న దారుణాలను బయటపెడుతున్న ఈ ఉదంతాలను బయటపెడుతుండటంతో పలు చోట్ల అఘాయిత్యాలకూ తావిస్తోంది. మాజీ హీరోయిన్ తనుశ్రీదత్తా, సీనియర్ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది.

మనస్థాపం చెందిన ఓ 59ఏళ్ల కబడ్డీ కోచ్.

మనస్థాపం చెందిన ఓ 59ఏళ్ల కబడ్డీ కోచ్.

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మీడియా, క్రికెట్, స్పోర్ట్స్, పాలిటిక్స్...ఇలా అన్ని రంగాల్లో పెను భూకంపమే సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘మీటూ'ఆరోపణలు తనపై ఆరోపించడంతో మనస్థాపం చెందిన ఓ 59ఏళ్ల కబడ్డీ కోచ్... అవమానభారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కబడ్డీ క్రీడాకారిణిని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండగా

కబడ్డీ క్రీడాకారిణిని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండగా

బెంగళూరు నగరానికి చెందిన రుద్రప్ప హెషమణి అనే సీనియర్ కబడ్డీ ప్లేయర్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రంలో కోచ్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో 13 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణిని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండగా... లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అతనిపై దాడి చేశారు.

తల్లిదండ్రులు కోచ్‌పై చెయ్యి చేసుకున్నారు

తల్లిదండ్రులు కోచ్‌పై చెయ్యి చేసుకున్నారు

బాలిక తల్లిదండ్రులు కోచ్‌పై చెయ్యి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కోచ్‌పై కేసు కూడా నమోదైంది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అతన్ని విధుల్లోంచి తొలగించారు. విచారణంలో కోచ్, బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం నిజమేనని తేలింది. దీంతో మనస్థాపం చెందిన హెషమణి, ఆత్మహత్య చేసుకున్నాడు.

శరీరంలోని అవయవాలను దానం చేయాలని

శరీరంలోని అవయవాలను దానం చేయాలని

‘మీటూ'కేసులో ఇరుక్కోవడం వల్ల మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు హెషమణి. ఇంకా అందులో తన శరీరంలోని అవయవాలను దానం చేయాలని కొడుకులకు చెప్పాడు. తన భార్యను చక్కగా చూసుకోవాలని కోరాడు. 'స్థానిక కన్నడ భాషలో రాసిన లెటర్‌లో అమ్మానన్ను చన్నగి నొడికో. నన్నగే తుంబా నొవాగిడే, ఆడా కరానా.. క్షమిసి బీడీ' అని ఉంది.

Story first published: Tuesday, October 16, 2018, 20:14 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X