Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi 2024: ప్రొ కబడ్డీ 2025లో నేటి మ్యాచ్ లు..

ప్రొ కబడ్డీ లీగ్ 2025లో లో భాగంగా మంగళవారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. పాట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ 39-39 స్కోర్లతో టై అయింది. దబాంగ్ ఢిల్లీ మొదటి అర్ధభాగంలో పాట్నా పైరేట్స్ గేమ్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ రెండవ అర్ధభాగంలో పాట్నా అద్భుతమైన పునరాగమనం చేసింది. పాట్నా పైరేట్స్ తరఫున దేవాంక్ 15 పాయింట్లతో టాప్ స్కోర్ చేయగా.. దీపక్ 7, అంకిత్ 5 పాయింట్లు సాధించారు. అషు మాలిక్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి 10 పాయింట్లు సాధించాడు.

సెకండాఫ్‌లోని రెండో ఎత్తుగడలో పాట్నా పైరేట్స్ దబాంగ్ ఢిల్లీని ఆల్-అవుట్‌ను నమోదు చేసింది. మంగళవారం జరిగిన మరో మ్యాచ్ లో తమిళ్ తలైవాస్.. యూపీ యోధాస్‌ను 40-26తో ఓడించడంచింది. తమిళ్ తలైవాస్ అద్భుతమైన ఆటతీరుతో విజయపథంలోకి తిరిగి వచ్చింది. సబ్‌స్టిట్యూట్‌లు మాసనముత్తు, ఇరానియన్ మొయిన్ షఫాగి రాణించారు. తమిళ్ తలైవాస్ మంచి ప్రారంభం చేసింది. అయితే, అషు సింగ్ చేసిన సూపర్ ట్యాకిల్ స్వదేశీ జట్టు యుపి యోధాస్‌కు పునరాగమనానికి నాంది పలికింది.

Haryana Steelers Puneri Paltans and Bengal Warriors Gujarat Giants will compete today as part of Pro Kabaddi 2025

మొదటి అర్ధభాగంలో యూపీ యోధాస్ పటిష్ట స్థితికి చేరింది. ఫస్ట్ ఆఫ్ ముగిసే సమయానికి 17-12 స్కోరు తేడాతో యూపీ యోధాస్ తమ బలమైన జోరును కొనసాగించింది. అయితే రెండో అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ పుంజుకుంది. దీంతో విజయం సాధించింది. కాగా ఈ రోజు ప్రొ కబడ్డీ లీగ్ 2025లో షాహీద్ విజయ్ సింగ్ పతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో హర్యానా స్టీలర్స్ పుణేరీ పల్టాన్స్ తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదే వేదికలో మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ గుజరాత్ జెయింట్స్ తో పోటీ పడనుంది.

Haryana Steelers Puneri Paltans and Bengal Warriors Gujarat Giants will compete today as part of Pro Kabaddi 2025

గురువారం ఇదే వేదికలో యూపీ యోధాస్, జైపూర్ పింక్ పంథార్స్ పోటీ పడనున్నాయి. మరో మ్యాచ్ లో యూ ముంబాతో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది. పాయింట్ల పట్టికలో హర్యానా స్టీలర్స్ మొదటి స్థానంలో ఉంది. యూ ముంబా రెండో స్థానంలో ఉండగా.. దబాంగ్ ఢిల్లీ మూడు, తెలుగు టైటాన్స్ 4వ స్థానంలో ఉంది. పుణేరీ పల్టన్స్ ఐదో స్థానంలో ఉండగా.. పాట్నా పైరెట్స్ ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జైపూర్ పింక్ పంథర్స్, యూపీ యోధాస్, తమిల్ తలైవాస్, బెంగల్ వారియర్స్, గుజరాత్ గెయింట్స్ ఉండగా.. చివరి స్థానంలో బెంగళూరు బుల్స్ ఉంది.

Story first published: Wednesday, November 27, 2024, 10:37 [IST]
Other articles published on Nov 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+