
పోరాడి ఓడిన టైటాన్స్
మ్యాచ్ ఆరంభం నుంచే అధిపత్యం కనబరిచిన హరియాణా స్టీలర్స్ ఒక దశలో భారీ అధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పుంజుకోవడంతో 19-23 తేడాతో ఫస్టాప్ ముగిసింది. కానీ సెకండాఫ్ ఆరంభంలో హర్యాణా జట్టు మళ్లీ చెలరేగింది. వరుసగా పాయింట్లు రాబడుతూ భారీ అధిక్యంలోకి దూసుకెళ్లింది. 32-21 తేడాతో పటిష్ట స్థితిలో నిలిచింది. చివరి 5 నిముషాల్లో పుంజుకున్న టైటాన్స్ అద్బుత ఢిపెన్స్, రైడింగ్‌తో చెలరేగింది. ఓటమి ఖాయం అనుకున్న స్థితి నుంచి ఒక్క సారిగా మ్యాచ్‌లోకి వచ్చింది. స్కోర్ అంతరాన్ని 34-38కి తీసుకొచ్చింది. ఈ సమయంలో అలర్టైన హర్యాణా ఆటగాళ్లు ఆచి తూచి ఆడారు. చివరి క్షణం వరకు అధిక్యాన్ని కాపాడుకున్నారు. దీంతో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. చివరకు మ్యాచ్‌ను హర్యాణా స్టీలర్స్ 39-37 తేడాతో సొంతం చేసుకుంది. హర్యాణా జట్టులో మీతు మహిందర్ 12 పాయింట్లతో చెలరేగగా, రోహిత్ గులియా 8 పాయింట్లతో సత్తా చాటాడు. మిగతా వారిలో రవి కుమార్ 4, మోహిత్, సురేందర్ నాడా మూడేసి పాయింట్లు సాధించారు. ఇక తెలుగు టైటాన్స్ జట్టులో సిద్దార్థ్ దేశాయ్, అంకిత్ బెనీవాల్ చెరో 9 పాయింట్లు సాధించారు. రాకేష్ 7, ఆదర్శ్ 3 పాయింట్లు సాధించారు. అరుణ్, రుతురాజ్ రెండేసి పాయింట్లు సాధించారు. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ చివరను పదకొండో స్థానంలో ఉంది.

పాట్నా ఘన విజయం
మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌పై పాట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది. ఫస్టాప్‌లో ఇరు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. దీంతో ఫస్టాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 14-14 తేడాతో సమంగా నిలిచాయి. అయితే సెకాండాఫ్‌లో పాట్నా ఆటగాళ్లు చెలరేగి ఆడారు. ఏ దశలోనూ పుణే జట్టుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో చివరికి మ్యాచ్‌ను పాట్నా జట్టు 38-26 తేడాతో సునాయసంగా గెలుచుకుంది. పాట్నా జట్టులో సచిన్ 10 పాయింట్లు సాధించగా.. ప్రశాంత్‌కుమార్ రాయ్ 5, సునీల్ 4 పాయింట్లు సాధించారు. మిగతా వారిలో సజిన్, షాదులోయి, మోను మూడేసి పాయింట్లు సాధించారు. పుణే జట్టులో మోహిత్ గోయత్ 7, అస్లాం ఇనామ్దార్ 6 పాయింట్లు సాధించారు. సోంబిర్ 5, అభినేష్, పంకజ్ రెండేసి పాయింట్లు సాధించారు. దీంతో పాయింట్ల పట్టికలో పాట్నా జట్టు 11 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.

నేటి మ్యాచ్‌లు
దబాంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగాల్ వారియర్స్- రాత్రి 7:30 గంటలకు
యూపీ యోధా వర్సెస్ గుజరాత్ జెయింట్స్- రాత్రి 8:30 గంటలకు


Click it and Unblock the Notifications
