For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

11 ఏళ్ల నిరీక్షణకు తెర..ప్రొ కబడ్డీ విజేతగా 'హరియాణా స్టీలర్స్'

ప్రొ కబడ్డీ సీజన్-11 విజేతగా హరియాణా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా.. హర్యానా స్టీలర్స్‌, పాట్నా పైరేట్స్‌ జట్లు తలపడ్డాయి.పాట్నా పైరేట్స్‌తో జరిగిన ఫైనల్లో హరియాణా స్టీలర్స్ 32-23 తేడాతో విజయం సాధించింది. శివమ్ పటారే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హరియాణా జట్టు అవలీలగా విజయం సాధించింది.మహమ్మద్ రీజూ షాదులూ , వినయ్ సత్తా చాటారు.ఇదిలా ఉంటే హరియాణా స్టీలర్స్ తొలిసారి ప్రొ కబడ్డీ టైటిల్ గెలిచింది. గతేడాది ఫైనల్‌కు చేరుకున్న హరియాణా స్టీలర్స్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Haryana Steelers Beat Patna Pirates To Win Pro Kabaddi 11 Title

వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకున్న హరియాణా జట్టు ఈసారి విజేతగా నిలిచింది. హరియాణా స్టీలర్స్‌కు జైదీప్‌ సారథిగా, మన్‌ప్రీత్‌ సింగ్‌ కోచ్‌గా వ్యవహరించారు.లీగ్‌ దశలో తిరుగులేని ఆధిపత్యంతో నేరుగా ఫైనల్‌కు చేరిన స్టీలర్స్‌.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించి విజేతగా నిలిచింది. పాట్నా పైరేట్స్‌ జట్టు ఇప్పటికే మూడుసార్లు ప్రొ కబడ్డీ విజేతగా నిలిచింది. నాలుగోసారి విజేతగా నిలవాలని భావించిన ఆ జట్టుకు నిరాశ ఎదురైంది. తొలిసారి ప్రొ కబడ్డీ విన్నర్ కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌-11వ సీజన్‌ నేటితో ముగిసింది.

Story first published: Sunday, December 29, 2024, 21:39 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+