For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: సొంతగడ్డపై తమిళ తలైవాస్‌కు ఆ అపవాదు తప్పేనా?

 Final chance at home win in the offing for Tamil Thalaivas against U Mumba

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ చెన్నై అంచె తుది దశకు చేరుకుంది. లీగ్‌లో భాగంగా తమిళ తలైవాస్ సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో యు ముంబా జట్టుతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై అంచెను ఘనంగా ముగించాలని తమిళ తలైవాస్ భావిస్తోంది.

మరోవైపు హర్యానా స్టీలెర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యు ముంబా తృటిలో ఓడిపోయింది. ప్రస్తుతం తమిళ తలైవాస్ 24 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా... యు ముంబా కూడా 24 పాయింట్లతోనే ఏడో స్థానంలో కొనసాగుతోంది.

జైపుర్ పింక్ పాంథర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు పాయింట్ల తేడాతో తమిళ తలైవాస్ ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇక, శుక్రవారం యు ముంబాతో జరగబోయే మ్యాచ్‌లో తమిళ తలైవాస్ ఓడితే సొంతగడ్డపై విజయం సాధంచని మూడో జట్టుగా నిలుస్తుంది.

గత మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్‌లు కేవలం 29 రైడ్ పాయింట్లను మాత్రమే సాధించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో వీరిద్దరూ కీలకపాత్ర పోషిస్తేనే తమిళ తలైవాస్ విజయం దక్కుతుంది లేదంటే మరో ఓటమి తప్పదు.

తమిళ తలైవాస్
ఆడినవి: 9
గెలచినవి: 3
టై: 2
ఓడనవి: 4
విన్ రేట్: 33.3%
బెస్ట్ రైడర్: రాహుల్ చౌదరి
బెస్ట్ ఢిఫెండర్: మన్జీత్ చిల్లర్

ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో యు ముంబా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన దాఖలా లేదు. దీంతో చెన్నై అంచెలో భాగంగా తమిళ తలైవాస్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో యు ముంబా రైడర్ల యావరేజి 15.56గా ఉంది. ఇప్పటివరకు అభిషేక్ సింగ్ మాత్రమే తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో రోహిత్ బలియన్, అర్జున్ దేశ్‌వాల్‌లు ఫరవాలేదనిపించారు.

యు ముంబా
ఆడినవి: 9
గెలిచినవి: 4
టై: 0
ఓడినవి: 5
విన్ రేట్: 44%
బెస్ట్ రైడర్: అభిషేక్ సింగ్
బెస్ట్ డిఫెండర్: ఫజల్ అట్రాచలి

Story first published: Friday, August 23, 2019, 15:26 [IST]
Other articles published on Aug 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+