Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi: న‌వీన్ ఖాతాలో మైల్‌స్టోన్‌ 500.. బెంగాల్‌, బెంగ‌ళూరుకు విజ‌యాలు

Dabangg Delhi, Bengaluru Bulls, Bengal Warriors wins

ప్రొ క‌బ‌డ్డీ లీగ్ ఆరంభంలోనే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. తాజాగా జ‌రిగిన మ్యాచ్‌ల్లో మాజీ ఛాంపియ‌న్ యు ముంబాను చిత్తు చేసి ద‌బాంగ్ ఢిల్లీ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రో మ్యాచ్‌లో త‌మిళ్ త‌లైవ‌స్‌ను ఓడించి బెంగ‌ళూరు బుల్స్ టోర్నీలో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక బెంగాల్ వారియ‌ర్స్.. గుజ‌రాత్ జెయింట్స్‌ను ఓడించింది. అయితే యు ముంబా, ద‌బాంగ్ ఢిల్లీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆట‌గాడు న‌వీన్ కుమార్ టోర్నీలో 500 పాయింట్లు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

న‌వీన్ ఖాతాలో మైల్‌స్టోన్ రికార్డు

న‌వీన్ ఖాతాలో మైల్‌స్టోన్ రికార్డు

ద‌బాంగ్ ఢిల్లీ ఆట‌గాడు న‌వీన్ కుమార్ ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో మైల్‌స్టోన్ రికార్డును అందుకున్నాడు. యు ముంబాతో జ‌రిగిన మ్యాచ్‌లో 17 పాయింట్ల‌తో చెల‌రేగిన ఈ రైడ‌ర్ ప్రొక‌బ‌డ్డీ లీగ్‌లో 500 పాయింట్ల మైల్ రాయిని చేరుకున్నాడు. కేవ‌లం 47 మ్యాచ్‌ల్లోనే ఈ ఘ‌న‌త అందుకున్న న‌వీన్‌.. లీగ్‌లో అత్యంత వేగంగా 500 పాయింట్లు సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. మాజీ ఛాంపియ‌న్ యు ముంబా, ద‌బాంగ్ ఢిల్లీ నువ్వా నేనా అన్నట్టుగా త‌ల‌ప‌డ‌డంతో ఫ‌స్టాప్ ముగిసే స‌మ‌యానికి యు ముంబా 12-10తో అధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ ఆరంభంలోనే న‌వీన్ కుమార్‌ను ఔట్ చేసిన ముంబా.. ఆ త‌ర్వాత కాసేప‌టికే ఢిల్లీ జ‌ట్టు మొత్తాన్ని ఆలౌట్ చేసింది. దీంతో ఆ జ‌ట్టు 19-10తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ త‌ర్వాత ఢిల్లీ ఆట‌గాడు న‌వీన్ కుమార్ విజృంభించాడు. వ‌రుస‌గా పాయింట్లు తెస్తూ ఢిల్లీని 24-23 తేడాతో అధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక 38వ నిముషంలో సూప‌ర్ రైడ్ చేసిన న‌వీన్ కుమార్.. ఢిల్లీని 29-24 తో మంచి అధిక్యంలో ఉంచాడు. చివ‌రి వ‌ర‌కు అదే అధిక్యాన్ని క‌న‌బ‌రచ‌డంతో 31-27 తేడాతో యు ముంబాపై ద‌బాంగ్ ఢిల్లీ విజ‌యం సాధించింది.

బెంగ‌ళూరుకు తొలి విజ‌యం

బెంగ‌ళూరుకు తొలి విజ‌యం

త‌మిళ్ త‌లైవ‌స్‌, బెంగ‌ళూరు బుల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. త‌ద్వారా ఈ టోర్నీలో ఆ జ‌ట్టు తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ్యాచ్ మొద‌టి నుంచి అధిక్యాన్ని క‌న‌బ‌రిచిన బెంగ‌ళూరు ఫ‌స్టాప్ ముగిసే స‌మ‌యానికి 19-13తో అధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో త‌మిళ్ త‌లైవ‌స్ పుంజుకుంది. బెంగ‌ళూరు జ‌ట్టును ఆలౌట్ చేసి 21-19తో అధిక్యంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత బెంగ‌ళూరు కూడా పంజుకోవ‌డంతో స్కోర్లు 25-25తో స‌మం అయ్యాయి. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు అధిక్యంలోకి వెళ్లింది. చివ‌రి వ‌ర‌కు అధిక్యాన్ని క‌న‌బ‌రిచి త‌మిళ్ త‌లైవ‌స్‌పై 38-30 తేడాతో బెంగ‌ళూరు బుల్స్ విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు కెప్టెన్ ప‌వ‌న్ కుమార్ 9 పాయింట్ల‌తో స‌త్తా చాట‌గా, చంద్ర‌న్ రంజిత్ 7 పాయింట్లు సాధించాడు.

బెంగాల్ విజ‌యం

బెంగాల్ విజ‌యం

అటు మ‌రో మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌పై బెంగాల్ వారియ‌ర్స్ 31-28 తేడాతో విజ‌యం సాధించింది. హోరాహారిగా సాగిన ఈ మ్యాచ్‌లో విజ‌యం బెంగాల్‌నే వ‌రించింది. బెంగాల్ ఆట‌గాడు మ‌నీంద‌ర్ సింగ్ 8 పాయింట్ల‌తో స‌త్తా చాటాడు. గుజ‌రాత్ ఆట‌గాడు రాకేష్ న‌ర్వాల్ 12 పాయింట్ల‌తో స‌త్తా చాటాడు. చివ‌రి వ‌ర‌కు హోరాహోరిగా త‌ల‌ప‌డిన ఇరు జ‌ట్లు దాదాపు అన్ని విభాగాల్లో సమానంగా నిలిచాయి. రైడ్ పాయింట్లు బెంగాల్ 18 సాధించ‌గా.. గుజ‌రాత్ 19 సాధించింది. ట్యాకిల్ పాయింట్లు బెంగాల్ 10 సాధించ‌గా.. గుజ‌రాత్ 8 సాధించింది.

 నేటి మ్యాచ్‌లు

నేటి మ్యాచ్‌లు

7:30 గంట‌ల‌కు పాట్నా పైరేట్స్ వ‌ర్సెస్ యూపీ యోధా

8:30 గంట‌ల‌కు పుణేరి ప‌ల్టాన్స్ వ‌ర్సెస్ తెలుగు టైటాన్స్‌

9:30 గంట‌ల‌కు జైపూర్ పింక్ పాంథ‌ర్స్ వ‌ర్సెస్ హ‌ర్యానా స్టీల‌ర్స్‌

Story first published: Saturday, December 25, 2021, 11:17 [IST]
Other articles published on Dec 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+