Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2024: రికార్డు సృష్టించిన దబాంగ్ ఢిల్లీ..!

శనివారం బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని బ్యాడ్మింటన్ హాల్‌లో జరిగిన కబడ్డీ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ జైపూర్ పింక్ పాంథర్స్‌ను 33-31తో ఓడించింది. దబాంగ్ ఢిల్లీ అజేయమైన పరంపరను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. దబాంగ్ ఢిల్లీ ఇప్పుడు PKL 11లో వరుసగా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. జైపూర్ రికార్డును అధిగమించింది. PKL 10 లో జైపూర్ వరుసగా 13-మ్యాచ్‌లు గెలిచింది. పుణెరి పల్టాన్స్ కూడా 14-మ్యాచ్ ల్లో వరుసగా విజయం సాధించింది. ఈ రికార్డున కూడా దబాంగ్ ఢిల్లీ సమం చేసింది.

.జైపూర్ డిఫెన్స్ మొదట్లో ఆధిపత్యం చెలాయించింది, కానీ ఆరో నిమిషంలో దబాంగ్ ఢిల్లీ ఊపందుకుంది. అయితే మరో ఐదు నిమిషాలు మిగిలి ఉండగానే అర్జున్ దేశ్వాల్ నేతృత్వంలోని జైపూర్ జట్టు స్కోరును సమం చేసింది. అయితే అషు కీ టచ్, అభిజీత్ మాలిక్‌పై యోగేష్ టాకిల్ దబాంగ్ ఢిల్లీకి రెండు పాయింట్ల ఆధిక్యాన్ని అందించింది. ఆఖరి క్షణాల్లో వివాదాస్పద కాల్ తర్వాత అర్జున్ ఔట్ అయ్యాడు. దీంతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.

Dabang Delhi set a record by winning 14 consecutive matches

మరో మ్యాచ్ లో పాట్నా పైటర్స్, గుజరాత్ జెయింట్స్ తలబడ్డాయి. అయితే ఈ మ్యాచ్ డ్రా అయింది. ఇరు జట్లు 40-40 పాయింట్లు చేశాయి. ఆదివారం పుణేలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తమిల్ తలైవాస్ బెంగళూరు బుల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇదే వేదికపై మరో మ్యాచ్ లో హర్యాన్ స్టీలర్స్ తో యూ ముంబా తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో హర్యానా స్టీలర్స్ మొదటి స్థానంలో ఉంది.

పాట్నా పైటర్స్ రెండు స్థానంలో ఉండగా.. దబాంగ్ ఢిల్లీ మూడు, యూపీ యోధ నాలుగో స్థానంలో ఉంది. జైపూర్ పింక్ ఫంథర్స్ ఐదు స్థానంలో కొనసాగుతుండగా.. యూ ముంబా, తెలుగు టైటాన్స్ ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు బుల్స్ చివరి స్థానంలో ఉంది.

Story first published: Sunday, December 22, 2024, 10:00 [IST]
Other articles published on Dec 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+