
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పుణెరి పల్టాన్ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు టోర్నీలో ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పుణెరి 31-26తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. రైడర్ మోరె 5 పాయింట్లు, డిఫెండర్ సందీప్ నర్వాల్ 4 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ (6 పాయింట్లు) రాణించాడు.
ప్రథమార్ధంలో ఇరు జట్లూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అవకాశాల్ని ఉపయోగించుకోలేదు. ఐతే విరామానికి ముందు పుంజుకున్న పుణెరి.. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 22-15తో పైచేయి సాధించింది. రెండో అర్ధంలో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. పుణెరికి ఢిల్లీ బాగానే పోటీ ఇచ్చినా.. అంతరాన్ని మాత్రం తగ్గించలేకపోయింది. జోన్-ఎలో పుణెరి 37 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
ఢిల్లీ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 43-41తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. రైడర్ పవన్ షెరావత్ 14 పాయింట్లతో బుల్స్‌ని గెలిపించాడు. ప్రత్యర్థి జట్టులో మన్‌జీత్ 10 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. ప్రథమార్ధం అయ్యేసరికి 21-18తో ఆధిక్యంలో నిలిచిన పట్నా.. ద్వితీయార్ధంలో గట్టి పోటీని తట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
దీంతె ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో పుణేరీ పల్టన్ ఆరో విజయం సొంతం చేసుకుంది. జోన్ 'ఎ'లో భాగంగా బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరు లో పుణేరీ పల్టన్ 31-27తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 43-41తో పట్నా పరేట్స్‌పై గెలిచింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్, యూపీ యోధాతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.