For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన బెంగళూరు బుల్స్

Bengaluru Bulls seal final spot in Pro Kabaddi League 2018

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేల్‌)లో బెంగళూరు బుల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రోహిత్‌ కుమార్‌ అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రతిభతో బెంగళూరు బుల్స్‌ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్లో ప్రవేశించింది. రైడర్‌ పవన్‌ (13) ఫామ్‌ కొనసాగించడంతో సోమవారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 41-29 తేడాతో గుజరాత్‌ ఫార్చ్యూన్‌జెయింట్స్‌ను చిత్తు చేసింది. రైడింగ్‌లో బుల్స్‌ ఆటగాడు పవన్‌ షెరావత్‌ చెలరేగాడు. పవన్‌ షెహ్రావత్‌ తన అద్భుత ఫామ్‌ కొనసాగిస్తూ 13 రెయిడ్‌ పాయింట్లతో బెంగళూరు జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

రోహిత్‌ కుమార్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతను 11 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మహేందర్‌ సింగ్‌ 6 ట్యాకిల్‌ పాయింట్లు చేశాడు. గుజరాత్‌ జట్టులో సచిన్‌ ఆకట్టుకున్నాడు. 12 సార్లు రైడింగ్‌కు వెళ్లిన సచిన్‌ 10 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌ చేరేందుకు గుజరాత్‌కు మరో అవకాశం ఉంది.

జనవరి 3న యూపీ యోధతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో గెలిస్తే ఆ జట్టు టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించవచ్చు. ఎలిమినేటర్‌-3 మ్యాచ్‌లో యూపీ యోధ 45-33తో దబంగ్‌ ఢిల్లీపై విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది. ఎలిమినేటర్‌-3 మ్యాచ్‌లో యూపీ యోధా 45-33 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీపై గెలిచి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. గురువారం క్వాలిఫయర్‌-2లో యూపీ యోధతో పోటీపడనుంది.

కాగా, పాయింట్ల పట్టిక ఆధారంగా జోన్ ఏ విభాగంలో గుజరాత్ జట్టు టాప్‌లో 93 పాయింట్లతో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో యూ ముంబా 86 పాయింట్లతో నిలిచింది. చివరిగా హర్యానా స్టీలర్స్ కేవలం 42 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. జోన్ బీ విభాగంలో బెంగళూరు బుల్స్ 78 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తమిళ్ తలైవాస్ ఆఖరి స్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, January 1, 2019, 9:20 [IST]
Other articles published on Jan 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+